Women’s Health: 40 ఏళ్ల తర్వాత మహిళలు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు ఇవి..! నిర్లక్ష్యం వద్దు..

|

Jan 07, 2025 | 7:34 AM

అందుకే హార్మోన్ల విషయంలో పరీక్షలు చేయించుకుంటూ.. వైద్యుల సూచనలు పాటిస్తుండాలి. ఐరన్ ఎక్కువగా ఉండే పండ్లు తినడం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత మహిళల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. కాబట్టి, 40 ఏళ్ల తర్వాత మహిళలు ఈ టెస్ట్‌లు కచ్చితంగా చేయించుకోవాలి.

Womens Health: 40 ఏళ్ల తర్వాత మహిళలు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు ఇవి..! నిర్లక్ష్యం వద్దు..
Women In 40s
Follow us on

ఇంటి పని, ఆఫీసు బాధ్యతలతో ఆడవారు తమ ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద్దచూపరు. కానీ, 40 ఏళ్ల తర్వాత మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే 40ఏళ్ల తర్వాత మహిళల్లో సంభవించే అనేక మార్పులు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి, అలాంటి అనారోగ్య సమస్యల బారీన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 40 ఏళ్లలో మహిళలు ఎముకల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

40ఏళ్ల వయసు వచ్చిన తర్వాతి నుంచి ఎముకల ఆరోగ్యం విషయంలో మహిళలు ఎక్కువ శ్రద్ధ చూపించడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఆ వయసులో చాలా మందిలో ఎముకల దృఢత్వం, సాంద్రత తగ్గుతుంటాయి. బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎముక సాంద్రత పరీక్ష చేయించుకోవడం ఎంతో అవసరం. 35 దాటిన ప్రతి మహిళ ఎముకల సాంద్రత పరీక్ష చేసుకోవాలి. 40లకు చేరాక ఎముకల దృఢత్వంపై మహిళలు అధిక శ్రద్ధ తీసుకోవాలి. అందుకు అవసరమైన ఆహారాలను తీసుకోవాలని చెబుతున్నారు.

కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను మహిళలు ఎక్కువగా తీసుకోవాలి. కాల్షియం వల్ల ఎముకల బలం, సాంద్రత పెరుగుతాయి. పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, సోయా బీన్స్, నట్స్ లాంటి వాటిలో కాల్షియం మెండుగా ఉంటుంది. 40ల వయసులోకి వచ్చాక మహిళలు తప్పనిసరిగా ఎముకల సాంద్రత పరీక్ష చేయించుకోవాలి. ఎముకల పరిస్థితి ఎలా ఉందో తప్పనిసరిగా తెలుసుకోవాలి. దీనివల్ల, ఎముకలు డ్యామేజ్ అయ్యే ఆస్టియోపోరోసిస్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మహిళలు వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. ముఖ్యంగా వెయిట్ ట్రైనింగ్ చేయడం మంచిని చెబుతున్నారు. వ్యాయామం వల్ల ఎముకల దృఢత్వం మెరుగ్గా ఉంటుంది. దీనిని అలవాటుగా మార్చుకోవాలని చెబుతున్నారు. అలాగే, విటమిన్ డీ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలని చెబుతున్నారు. తగినంత సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. కాల్షియంను శోషించుకునేందుకు ఈ విటమిన్ ఉపయోగపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే, కూరగాయలు, పండ్లు లాంటి పోషకాహారాలను ఎక్కువగా తీసుకోవాలి.

శరీరంలో హర్మోన్ల మార్పులు ఎముకలపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గితే సాంద్రత తగ్గుతుంది. అందుకే హార్మోన్ల విషయంలో పరీక్షలు చేయించుకుంటూ.. వైద్యుల సూచనలు పాటిస్తుండాలి. ఐరన్ ఎక్కువగా ఉండే పండ్లు తినడం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత మహిళల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. కాబట్టి, 40 ఏళ్ల తర్వాత మహిళలు ఈ టెస్ట్‌లు కచ్చితంగా చేయించుకోవాలి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..