Weight Loss Tips: ఈ చిన్న మార్పులతో ఏమీ చేయకుండానే వెయిట్ లాస్ అవ్వొచ్చు..

ఇప్పుడున్న కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్య అధిక బరువు. బరువు ఎక్కువగా ఉండటం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బరువు పెరగడం చాలా సులభం. కానీ తగ్గించుకోవాలంటే మాత్రం చాలా కష్ట పడాలి. బరువు తగ్గడానికి సంవత్సరాలకు సంవత్సరాలే పట్టొచ్చు. అంత వరకూ కష్ట పడుతూనే ఉండాలి. నిత్యం వ్యాయామాలు చేస్తూ.. సరైన డైట్ తీసుకోవాలి. అలాగే బరువు తగ్గిన తర్వాత..

Weight Loss Tips: ఈ చిన్న మార్పులతో ఏమీ చేయకుండానే వెయిట్ లాస్ అవ్వొచ్చు..
Weight Loss
Follow us

|

Updated on: Jun 26, 2024 | 6:12 PM

ఇప్పుడున్న కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్య అధిక బరువు. బరువు ఎక్కువగా ఉండటం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బరువు పెరగడం చాలా సులభం. కానీ తగ్గించుకోవాలంటే మాత్రం చాలా కష్ట పడాలి. బరువు తగ్గడానికి సంవత్సరాలకు సంవత్సరాలే పట్టొచ్చు. అంత వరకూ కష్ట పడుతూనే ఉండాలి. నిత్యం వ్యాయామాలు చేస్తూ.. సరైన డైట్ తీసుకోవాలి. అలాగే బరువు తగ్గిన తర్వాత కూడా ఆ బరువును మెయిన్ టైన్ చేస్తూ ఉండాలి. అయితే చాలా మందికి సమయం అంతగా ఉండదు. అలాంటి ప్రతి రోజూ కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం.. చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల బరువును అదుపు చేసుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

నీటిని ఎక్కువగా తీసుకోవడం:

నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువును అదుపు చేయవచ్చు. నీటిని తీసుకోవడం వల్ల జీవక్రియ అనేది పెరుగుతుంది. కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఆకలిని చాలా వరకు తగ్గిస్తుంది. మీరు బరువు తగ్గాలి అనుకుంటే.. ప్రతి రోజూ 10 – 8 గ్లాసుల నీటిని తాగేందుకు ప్రయత్నం చేయండి.

ఫైబర్ ఉన్న ఆహారాలు తీసుకోండి:

ఫైబర్ రిచ్ ఫుడ్స్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ అనేది నెమ్మదిస్తుంది. తక్కువగా తిన్నా కూడా త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోండి. స్నాక్స్‌లో కూడా వీటిని తినేందుకు ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి

ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోండి:

మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని కూడా ఎక్కువగా తీసుకోండి. దీని వల్ల కూడా కడుపు త్వరగా నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో ఇతర ఆహారాలను తీసుకోలేరు.

నెమ్మదిగా తినండి:

చాలా మంది భోజనాన్ని చాలా కంగారు కంగారుగా తినేస్తారు. దీని వల్ల మీకు తెలియకుండానే ఎక్కువగా తింటారు. అలా కాకుండా నెమ్మదిగా.. ప్రతీ ఆహారాన్ని నమిలి తినడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు తక్కువ ఆహారం తింటారు.

మంచి నిద్ర అవసరం:

మీరు బరువు తగ్గడం అనేది మీ నిద్రపై కూడా ఆధార పడి ఉంటుంది. కాబట్టి సరైన స్లీప్ అవసరం. ప్రతి రోజూ 7 – 9 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి.

డ్రింక్స్, స్నాక్స్ తక్కువగా:

మీరు బరువు తగ్గాలి అని ఫిక్స్ అయితే.. డ్రింక్స్, స్నాక్స్‌ని తీసుకోవడం పూర్తిగా మానేయండి. వీటి వలన కూడా మీరు వెయిట్ గెయిన్ అవుతారు. మీరు రోజులో ఏం తినాలి అనేది ముందుగానే ఓ చార్ట్ రాసుకుని పెట్టుకోండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..