28 June 2024

రోజూ ఈ గింజలు తింటే.. 

Narender.Vaitla

బరువు తగ్గాలనుకునే వారికి చియా గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలోని ఫైబర్‌ కారణంగా త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. 

డయాబెటిస్‌తో బాధపడేవారికి కూడా చియా గింజలు బాగా ఉపయోగపడతాయి. ఇదులోని ఫైబర్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ అధిక కంటెంట్ మీ శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది.

మంచి గుండె ఆరోగ్యం కోసం ప్రతీరోజూ చియా గింజలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తాయి.

చియా గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచుతుంది. బోలు ఎముకల వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

చియా గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఇది చర్మం ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ పెంచడంలో కూడా చియా గింజలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది.

జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా చియా గింజలను క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబఱ్‌ కంటెంట్ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.