కొందరు భోజనం చేసిన కాసేపటికే మళ్లీ ఆకలి అనిపిస్తోందేంటి? అంటూ ఏదో ఒక తినుబండారం కోసం వెతికేస్తుంటారు. తీరా తిన్నాక అతిగా తినేస్తున్నా, బరువు పెరుగుతున్నామని బాధపడిపోతుంటారు
TV9 Telugu
ఇలా మీకూ జరుగుతోందా? దానికి కారణాలేంటో తెలుసుకోండి.. నిజానికి, మనం తినే ఆహారం ద్వారా మనకు ఎక్కువ మొత్తంలో ప్రొటీన్, తక్కువ కార్బోహైడ్రేట్స్, కొవ్వులు అవసరమవుతాయి
TV9 Telugu
ప్రొటీన్ వల్ల గ్లూకగాన్ అనే హార్మోను విడుదలవుతుంది. దీంతో కడుపు నిండినట్లుగా అనిపించించేలా చేస్తుంది. ఒకవేళ అది తగినంత పరిమాణంలో శరీరానికి అందకపోతే ఇలాంటి భావన కలుగుతుంటుంది
TV9 Telugu
అందుకే ప్రొటీన్ సరిగా అందుతోందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే.. అది నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీంతో చాలాసేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది
TV9 Telugu
అంతేకాదు ఆహారంపైకి మనసు మళ్లకుండానూ చూస్తుంది. శరీరానికి ఇది తగినంత అందకపోయినా ఇలా ఆకలి అనిపిస్తుంటుంది. అందుకే ఫైబర్ అధిక మోతాదులో అందించే ఆహారాన్ని తీసుకోవాలి
TV9 Telugu
మన శరీరంలో ఉండే ప్రధాన హార్మోన్లలో లెప్టిన్ కూడా ఒకటి. ఇది కడుపు నిండిందన్న సంకేతాన్ని మెదడుకు చేరవేస్తుంది. ఇది సరిగా ఉత్పత్తి కాకపోతేనే ఇదిగో ఇలా ఎంత తిన్నా మళ్లీమళ్లీ ఆకలి వేస్తుంటుంది
TV9 Telugu
అందుకే హార్మోనుల్లో అసమతుల్యత ఉందేమో చెక్ చేసుకోవాలి. లేదంటే బరువూ అదుపులో ఉండదు. ఒత్తిడి కూడా పెరిగి అతిగా ఆహారం తీసుకునేలా మనసు మళ్లిస్తుంది. అలాగే రోజులో కనీసం 7 గంటలు నిద్రకు కేటాయించాలి
TV9 Telugu
నిద్ర సమయంలో శరీరం తనని తాను రిపేర్ చేసుకుంటుందనే విషయం తెలిసిందే. కానీ తగినంత నిద్రలేకపోతే జీవక్రియలన్నీ కుంటుపడతాయి. హార్మోనుల్లో సమస్యలు ఏర్పడి అతిగా ఆకలేస్తుంటుంది