బ్రౌన్ షుగర్‌లో పొటాషియం, జింక్, రాగి, భాస్వరం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల ఎముకలు ఆరోగ్యంగా మారుతాయిని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గాలనుకునే వారు బ్రౌన్ షుగర్‌ను అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తెల్ల చక్కెర కంటే ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి.
బ్రౌన్ షుగర్ యాంటీ ఏజింగ్ కాంపోనెంట్‌గా పనిచేస్తుంది. ఇది చర్మంపై కణాలను తొలగించే స్క్రబ్‌లా పనిచేస్తుంది. చర్మంపై చిన్న మచ్చలు మచ్చలను తొలగిస్తుంది.
జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా బ్రౌన్ షుగర్ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో మలబద్ధకం సమస్య పరార్ అవుతుంది.
బ్రౌన్ షుగర్‌లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ షుగర్‌ను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
వైట్ షుగర్‌తో పోలిస్తే బ్రౌన్ షుగర్‌లో తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలలో నెమ్మదిగా, స్థిరమైన పెరుగుదలకు కారణమవుతుంది.
రోగ నిరోధక శక్తి పెరగడంలో బ్రౌన్ షుగర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.