
పాదరక్షల ఎంపికలో అవి పాదాలకు ఇచ్చే సపోర్ట్ ఆధారంగా నిపుణులు రేటింగ్‌లు ఇస్తుంటారు. ఉదాహరణకు, రన్నింగ్ షూస్‌కు 8-10 రేటింగ్ ఇస్తే, స్లిప్-ఆన్స్ (Slip-ons) కు కేవలం 3-10 రేటింగ్ మాత్రమే లభిస్తుంది. రన్నింగ్ షూస్‌లో ఉండే కుషనింగ్, ఆర్చ్ సపోర్ట్, షాక్ అబ్సార్ప్షన్ సామర్థ్యం పాదాలపై ఒత్తిడిని తగ్గించి గాయాల నుండి రక్షిస్తాయి. దీనికి భిన్నంగా స్లిప్-ఆన్స్ లేదా ఫ్లాట్ చెప్పులలో సరైన సపోర్ట్ ఉండదు. అసలు షూస్ రేటింగ్‌ల వెనుక అసలు రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం..
రన్నింగ్ షూస్‌ను ప్రత్యేకమైన శాస్త్రీయ పద్ధతిలో డిజైన్ చేస్తారు. వీటిలో ఉండే మందపాటి సోల్ (Sole), కుషనింగ్, మనం నడిచేటప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు భూమి నుండి వచ్చే ఒత్తిడిని (Shock) గ్రహిస్తాయి.
ఇవి పాదాల లోపలి వంపుకు (Arch support) అద్భుతమైన మద్దతును ఇస్తాయి. దీనివల్ల కీళ్ల నొప్పులు, మడమ నొప్పులు రాకుండా ఉంటాయి. అందుకే ఎక్కువ సమయం నడవడానికి లేదా నిలబడటానికి ఇవి ఉత్తమమైనవి.
కట్టడం సులభంగా ఉంటుందని చాలామంది స్లిప్-ఆన్స్ లేదా పూర్తిగా ఫ్లాట్‌గా ఉండే చెప్పులను వాడుతుంటారు. కానీ, నిపుణులు వీటికి చాలా తక్కువ రేటింగ్ ఇచ్చారు. ఈ రకమైన పాదరక్షలలో ఆర్చ్ సపోర్ట్ లేదా హీల్ కప్ (Heel cup) అసలు ఉండవు. ఇవి పాదాలను సరిగ్గా పట్టి ఉంచలేవు. వీటిని రోజంతా వేసుకోవడం వల్ల పాదాల కండరాలపై ఒత్తిడి పెరిగి ప్లాంటార్ ఫాసిటిస్ (అరికాళ్ల నొప్పి), టెండినైటిస్ వంటి సమస్యలు వస్తాయి.
ఆకృతిని గమనించండి: మీ పాదం ఫ్లాట్‌గా ఉందా లేదా వంపు కలిగి ఉందా అని చూసుకుని, దానికి సరిపోయే ఆర్చ్ సపోర్ట్ ఉన్న షూస్ ఎంచుకోండి.
ఫ్లెక్సిబిలిటీ: షూస్ మరీ మెత్తగా లేదా మరీ గట్టిగా ఉండకూడదు. ముందరి భాగం కాస్త వంగేలా ఉండాలి.
సమయాన్ని బట్టి: ఇంట్లో లేదా తక్కువ సమయం నడవడానికి స్లిప్-ఆన్స్ పర్వాలేదు. కానీ, వ్యాయామాలు లేదా ఎక్కువ దూరం ప్రయాణాలకు మాత్రం రన్నింగ్ షూస్ లేదా స్నీకర్స్ మాత్రమే వాడాలి.
పాదరక్షలు అనేవి కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు, అది మన శరీర సమతుల్యతను కాపాడే ఒక ముఖ్యమైన సాధనం. తప్పుడు రేటింగ్ లేదా తప్పుడు సైజు ఉన్న చెప్పులు వాడటం వల్ల దీర్ఘకాలిక మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, తదుపరిసారి మీరు షాపింగ్‌కు వెళ్లినప్పుడు లుక్స్‌తో పాటు అవి మీ పాదాలకు ఇచ్చే సపోర్ట్, రేటింగ్‌ను కూడా గమనించి సరైన నిర్ణయం తీసుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..