Leftover Rice: చద్దన్నం తినడం ఆరోగ్యమా?.. అనారోగ్యమా? నిపుణులు ఏం చెబుతున్నారు!

Leftover Rice healthy or not : ప్రతి ఇంట్లో రాత్రి వండిన అన్నం కచ్చితంగా కొంచెమైన మిగులుతుంది. దాన్ని ఉదయాన్నే తాళింపు వేసుకొని తింటాం. కానీ కొందరు రాత్రి వండిన అన్నం తినడం మంచిదికాదు అంటారు. కానీ మన పెద్దలు మాత్రం చద్దనం తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. ఈ రెండింటిలో ఏది నిజం.. నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Leftover Rice: చద్దన్నం తినడం ఆరోగ్యమా?.. అనారోగ్యమా? నిపుణులు ఏం చెబుతున్నారు!
Leftover Rice

Updated on: Jan 01, 2026 | 3:55 PM

చాలా మంది ఇళ్లలో రాత్రి కొద్దిక ఎక్కువ రైసే వండుకుంటాం. అయితే ఉదయం మిగిలిపోయిన అన్నాన్ని కొంతమంది తింటే, మరికొందరు పారేస్తారు. ఎందుకంటే కొందరు చద్దన్నం తినడం హానికరం అని భావిస్తారు. మరికొందరు దానిని ఆరోగ్యానికి ప్రయోజనకరంగా భావిస్తారు. అయితే చద్దన్నం తినడం సరైనదా కాదా అని అంటే సరైనదే.. చద్దన్నం ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా అనేది పూర్తిగా దానిని ఎలా నిల్వ చేశారు, తినడానికి ఎంత సమయం పట్టింది, దానిని ఎలా తిరిగి వేడి చేశారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

UK కి చెందిన సర్జన్, కంటెంట్ క్రియేటర్ కరణ్ రాజన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌ ప్రకారం.. చద్దన్నం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందట, కానీ దానిని సరిగ్గా నిల్వ చేసి ఎలా వేడి చేయాలో తెలుసుకోవడం ముఖ్యమని ఆయన చెప్పారు. ఈ ముఖ్యమైన నియమాలను పాటించకపోతే, చద్దన్నం తినడం వల్ల కడుపు సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం పెరుగుతుందని ఆయన తెలిపారు.


సరిగ్గా నిల్వ చేయడం ముఖ్యం

చద్దన్నం సరిగ్గా నిల్వ చేయడం చాలా ముఖ్యం అని డాక్టర్ రాజన్ తెలిపారు. ముడి బియ్యం సాధారణ వంట సమయంలో చనిపోని బ్యాక్టీరియా బీజాంశాలను కలిగి ఉంటాయి.. అయితే బియ్యాన్ని వండిన తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద చాలా సమయం ఉంచితే, ఈ బీజాంశాలు తిరిగి క్రియాశీలమవుతాయి, బ్యాక్టీరియాగా రూపాంతరం చెందుతుంది. అందుకే దానిని సరిగ్గా నిల్వ చేయడం, తిరిగి వేడి చేయడం చాలా ముఖ్యం. ఇలా సరిగ్గా నిల్వ చేయకుండా దాన్ని అలానే తింటే ఫుడ్‌పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఈ భద్రతా చిట్కాలు

మీరు రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఎక్కువ సమయం బ్యాక్టీరియా ‘ప్రమాద మండలం’లో ఉంచితే అంటే 5°C , 60°C (40°F) మధ్య ఉష్ణోగ్రతలలో ఉంచినప్పుడు.. ఆ బ్యాక్టీరియా వేగంగా రూపాంతరం చెందుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. మీరు తిన్న తర్వాత మిగిలిన అన్నానన్ని.. ఒకటి నుండి రెండు గంటలలోపే ఫ్రిజ్‌లో పెట్టేయండి. మీ ప్రిజ్ టెంపరేటర్ 40°F (సుమారు 4°C) లేదా అంతకంటే తక్కువ ఉండేట్టు చూసుకోండి. ఇలా నిల్వ చేయడం ద్వారా 3-6 రోజులు వరకు సురక్షితంగా ఉంటుంది.

మళ్లీ వేడి చేసుకోవడం

రాత్రి అన్నాన్ని ఉదయం వేడి చేసేటప్పుడు, దానిని 165°F (సుమారు 74°C) వరకు పూర్తిగా వేడి చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అయితే, ఈ అనాన్ని మళ్లీ, మళ్లీ వేడి చేయకుండా ఉండటం మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే చద్దన్నాన్ని పదే పదే వేడి చేయడం వల్ల బ్యాక్టీరియా పెరుగుదల ప్రమాదం పెరుగుతుంది.

చద్దన్నం తినడం మంచిదేనా?

డాక్టర్ ప్రకారం.. మన పెద్దలు చెప్పినట్టు చద్దన్నం మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది సాధారణ కార్బోహైడ్రేట్ల వలె త్వరగా జీర్ణం కాదని, ఫైబర్‌గా పనిచేస్తుందని ఆయన చెబుతున్నారు. చద్దన్నం రెసిస్టెంట్ స్టార్చ్‌ను ఏర్పరుస్తుంది, ఇది మీ ప్రేగులోని మంచి బ్యాక్టీరియా ఇష్టపడే ఒక రకమైన ఫైబర్. ఇది ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పోషిస్తుంది. బ్యూటిరేట్ వంటి షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్‌ల ఉత్పత్తిని పెంచుతుంది. కాబట్టి పైన పేర్కొన్న పద్దతులను పాటించడం వల్ల మీరు చద్దన్నం ప్రయోజనాలను పొందవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.