Hidden Facts: కస్టమర్లను ఆకట్టుకునే ట్రిక్.. హోటల్ గదుల్లో అద్దాల బాత్రూమ్‌ల వెనుక ఉన్న మైండ్ బ్లోయింగ్ లాజిక్స్!

టూరిజం లేదా బిజినెస్ పనుల మీద బయటి ఊర్లకు వెళ్లినప్పుడు మనం రకరకాల హోటల్ రూమ్స్‌లో బస చేస్తుంటాం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో త్రీ స్టార్, ఫైవ్ స్టార్ వంటి లగ్జరీ హోటళ్లలో ఒక సరికొత్త ట్రెండ్ బాగా కనిపిస్తోంది. రూమ్‌లో ఉన్న బాత్రూమ్‌కు సిమెంట్ గోడలకు బదులుగా పూర్తిగా పారదర్శకంగా ఉండే గాజు గోడలను ఏర్పాటు చేస్తున్నారు. మొదటిసారి ఇలాంటి రూమ్‌లకు వెళ్లిన వారికి, ముఖ్యంగా కుటుంబంతో కలిసి వెళ్లే వారికి ఇది కొంతవరకు ఇబ్బందిగా, వింతగా అనిపిస్తుంది.

Hidden Facts: కస్టమర్లను ఆకట్టుకునే ట్రిక్.. హోటల్ గదుల్లో అద్దాల బాత్రూమ్‌ల వెనుక ఉన్న మైండ్ బ్లోయింగ్ లాజిక్స్!
Why Hotel Bathrooms Have Glass Walls

Updated on: Jul 15, 2026 | 3:08 PM

 

కేవలం రొమాంటిక్ వాతావరణం కోసమే హోటళ్లు ఇలాంటి గ్లాస్ బాత్రూమ్‌లను డిజైన్ చేస్తాయని చాలా మంది భావిస్తుంటారు. కానీ, దీని వెనుక కేవలం రొమాన్స్ మాత్రమే కాదు.. హోటల్ యాజమాన్యాలకు లాభం చేకూర్చే బలమైన ఆర్కిటెక్చరల్, సైకలాజికల్ మెయింటెనెన్స్ కారణాలు దాగి ఉన్నాయి. మరి హోటల్ గదుల్లో అద్దాల బాత్రూమ్‌లు పెట్టడం వెనుక ఉన్న ఆ ఆసక్తికరమైన కారణాలు ఏంటో తెలుసుకుందాం.

1. గది విశాలంగా కనిపించడం

మెట్రో నగరాలలో హోటల్ రూమ్స్ వైశాల్యం సాధారణంగా తక్కువగా ఉంటుంది. బాత్రూమ్‌కు మందపాటి కాంక్రీట్ లేదా ఇటుక గోడలను కడితే గది మరింత చిన్నదిగా, ఇరుకుగా అనిపిస్తుంది.

అదే గోడల స్థానంలో సన్నని గాజు పలకలను వాడటం వల్ల గది చాలా పెద్దదిగా, విశాలంగా ఉన్నట్లు ఒక భ్రమ కలుగుతుంది. ఇటుక గోడల కంటే గ్లాస్ గోడలు తక్కువ స్థలాన్ని ఆక్రమించడమే దీనికి కారణం.

2. వెలుతురు ప్రసరించడం

బాత్రూమ్‌కు పారదర్శక గాజు ఉండటం వల్ల గదిలోని కిటికీల నుండి వచ్చే వెలుతురు లేదా మెయిన్ రూమ్ లైటింగ్ బాత్రూమ్ లోపలికి కూడా ప్రసరిస్తుంది.

దీనివల్ల పగటిపూట బాత్రూమ్‌లో విడిగా లైట్లు వేయాల్సిన అవసరం ఉండదు. ఇది హోటల్ యాజమాన్యానికి విద్యుత్ బిల్లులను ఆదా చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది.

3. మెయింటెనెన్స్

సాధారణ కాంక్రీట్ గోడలపై తేమ కారణంగా నాచు పట్టడం, పెయింట్ ఊడిపోవడం లేదా పగుళ్లు రావడం వంటివి జరుగుతుంటాయి. దీనివల్ల హోటల్ రూమ్ లుక్ దెబ్బతింటుంది.

కానీ గ్లాస్ గోడలను సులభంగా క్లీన్ చేయవచ్చు. వీటికి తేమ లేదా చెదలు పట్టే ప్రమాదం ఉండదు. గ్లాస్ క్లీనర్‌తో తుడిస్తే నిమిషాల్లో కొత్తవాటిలా మెరిసిపోతాయి.

4. భద్రతా కారణాలు దొంగతనాల నివారణ:

ఒంటరిగా ప్రయాణించే వారికి బాత్రూమ్‌లో అకస్మాత్తుగా పడిపోవడం లేదా గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితులు తలెత్తితే బయటి వారికి వెంటనే కనిపించే అవకాశం ఉంటుంది.

అలాగే కొంతమంది కస్టమర్లు బాత్రూమ్ లోపల ఉన్న వస్తువులను బ్యాగ్‌లో వేసుకుని వెళ్లే దొంగతనాలకు పాల్పడుతుంటారు. గ్లాస్ గోడల వల్ల ఇటువంటి పనులు చేయకుండా నిరోధించవచ్చు.

5. ప్రైవసీ కోసం స్మార్ట్ ఆప్షన్స్:

ఫ్యామిలీతో వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా ఉండటానికి హోటళ్లు కేవలం ఖాళీ గాజును మాత్రమే ఉంచవు. ప్రైవసీ కోసం బాత్రూమ్ లోపల వేసుకునేందుకు పక్కనే కర్టెన్లు లేదా బ్లైండ్స్ అందుబాటులో ఉంచుతారు.

కొన్ని అత్యాధునిక హోటళ్లలో స్విచ్ వేయగానే పారదర్శక గాజు కాస్తా వైట్ కలర్ గ్లాస్‌లా మారిపోయే టెక్నాలజీని కూడా వాడుతున్నారు.

హోటల్ రూమ్‌కు ఆధునిక మరియు లగ్జరీ లుక్ తీసుకురావడంతో పాటు, వ్యాపార పరంగా స్థలాన్ని, విద్యుత్‌ను ఆదా చేసేందుకే హోటళ్లు ఈ గ్లాస్ బాత్రూమ్ కాన్సెప్ట్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నాయి.

 

 

Follow Us