
ఇండియాలో కుటుంబ విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నప్పటికీ.. ఇప్పుడు విడాకులు సర్వసాధారణం అవుతున్నాయి. ముఖ్యంగా గత పదేళ్లలో.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో విడాకుల సంఖ్య బాగా పెరిగిందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికా, యూరప్ వంటి దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో విడాకుల శాతం ఇంకా తక్కువే. అయినప్పటికీ.. ప్రతి 1,000 వివాహాల్లో సుమారు 13 విడాకులతో ముగుస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విడాకుల రేటు 1 శాతం నుంచి 1.3 శాతం మధ్య ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో విడాకులు ఇప్పటికీ పెద్ద తప్పుగా భావిస్తారు. ఆ భయంతో చాలా మంది విడిపోవడానికి వెనుకాడతారు. కానీ నగరాల్లో పరిస్థితి వేరు. యువతరం తమ బంధంలో అసంతృప్తిగా ఉంటే.. కేవలం సమాజం కోసమే కలిసి ఉండాలని భావించడం లేదు. వారు విడిపోవడానికే ఇష్టపడుతున్నారు.
గత పది సంవత్సరాల్లో పెద్ద నగరాల్లో విడాకుల రేటు 30 నుంచి 40 శాతం పెరిగింది. ప్రస్తుతం పట్టణాల్లో ప్రతి రోజూ దాదాపు 100 విడాకుల పిటిషన్లు దాఖలవుతున్నాయి. జీవనశైలిలో మార్పులు, ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం వంటివి ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలని నిపుణులు అంటున్నారు.
ప్రస్తుతం సమాజంలో వస్తున్న ట్రెండ్స్ వల్ల విడాకుల సంఖ్య పెరుగుతోంది. మహిళల ఫైనాన్షియల్ ఫ్రీడమ్, లీగల్ రైట్స్‌పై ఉన్న అవేర్‌నెస్, అలాగే లైఫ్ స్టైల్‌లో వచ్చిన చేంజ్‌లు దీనికి మెయిన్ రీజన్స్. మ్యారేజ్ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ వస్తే.. వాటిని సాల్వ్ చేసుకోలేనప్పుడు కపుల్స్ విడిపోవడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.