Success Story: ఫలితవివ్వని ఉద్యోగ వేట.. రూ.30వేల పెట్టుబడితో జీవితాన్ని అందంగా మలుచుకున్న ఆదర్శ యువతి

|

Apr 25, 2022 | 3:05 PM

Success Story: ఉన్నత చదువు, మంచి ఉద్యోగం, అందమైన జీవితం గురించి ఇలా అందరూ కలలు కంటారు. కానీ కొంత మాత్రమే తాము కన్న కలలు నేర్చవేర్చుకోవడానికి కష్టాలు ఎదురైనా.. ఆటంకాలు ..

Success Story: ఫలితవివ్వని ఉద్యోగ వేట.. రూ.30వేల పెట్టుబడితో జీవితాన్ని అందంగా మలుచుకున్న ఆదర్శ యువతి
Graduate Bihar Girl
Follow us on

Success Story: ఉన్నత చదువు, మంచి ఉద్యోగం, అందమైన జీవితం గురించి ఇలా అందరూ కలలు కంటారు. కానీ కొంత మాత్రమే తాము కన్న కలలు నేర్చవేర్చుకోవడానికి కష్టాలు ఎదురైనా.. ఆటంకాలు కలుగుతున్నాయి లెక్క చేయకుండా కష్టపడతారు. విజయాన్ని సొంతం చేసుకుంటారు. చదువు ఐన తర్వాత ఉద్యోగం కోసం అందరూ ప్రయత్నం చేస్తారు. కొంతమందిని మాత్రం తమ చదువు, ప్రతిభకు తగిన ఉద్యోగం వరిస్తుంది. మరికొందరు పరిస్థితుల ప్రభావంతో ఏదోకటి అంటూ దొరికిన దానితో జీవితాన్ని గడిపేస్తారు. ఇంకొందరు.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరక్కపోతే డిగ్నిటీ ఆఫ్ లేబర్ (Dignity of labour) అన్న పదాన్ని నమ్ముకుని.. తమకంటూ సొంతం ఐడెంటీని సృష్టించుకుంటారు. ఈరోజు ఒక ఎకనామిక్స్(Economics) పట్టభద్రురాలు టీ స్టాల్ పెట్టి.. ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది. చాయ్వాలా, చాయ్ పే చర్చ అనే పదాలు తరచుగా వింటూనే ఉన్నాం.. ముఖ్యంగా మోడీ ప్రధాని ఐన అనంతరం ఈ పదాలు బాగా ప్రాచుర్యం పొందాయి. చాయ్వాలా నుంచి ప్రధాని స్థాయికి మోడీ ఎదిగిన తీరు అందరకీ ఆదర్శమే.  అయితే ఓ 24 ఏళ్ల అమ్మాయి తాను చాయివాలీగా చెప్పుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే..

బీహార్లోని పట్నాకు చెందిన 24 ఏళ్ల ప్రియాంక గుప్తా 2019 లో ఎకనామిక్స్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. రెండేళ్ల పాటు ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు కూడా చేసింది. ‘ఎంబీఏ చాయ్వాలాగా’గా పిలిచే ప్రఫుల్ బిల్లోర్ ని స్ఫూర్తిగా తీసుకుంది. తాను ఎందుకు టీస్టాల్ పెట్టకూడదు అని ఆలోచించింది. దీంతో టీ స్టాల్ ఏర్పాటు కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణాలు చేశానని..  తనకు ఎవరూ లోన్ ఇవ్వలేదని… అప్పుడు స్నేహితులు ముందుకొచ్చి.. వారు రూ. 30 వేలను సాయంగా ఇచ్చారని.. అప్పుడు షాప్ ఏర్పాటు చేసినట్లు చెప్పింది ప్రియాంక.  ఇందుకు తల్లిదండ్రుల సహాకారం కూడా లభించింది. ఏప్రిల్ 11న టీ స్టాల్ను స్టార్ట్ చేసింది.  రెగ్యులర్‌ టీతో పాటు పాన్‌, మసాలా, చాక్లెట్‌ టీ, బిస్కెట్లు అమ్ముతోందామె. అంతేకాదు అక్కడ బ్యానర్ల మీద స్ఫూర్తినిచ్చే ఎన్నో కొటేషన్లు సైతం ఉంచింది.  ‘పీనా హీ పడేగా’ (తాగాల్సిందే), ‘సోచ్ మత్.. చాలూ కర్దే బస్’ (ఆలోచించకు.. మొదలుపెట్టు బాస్) వంటి కొటేషన్స్ తో ఉండే బ్యానర్ను ఏర్పాటు చేసింది.  ఈ టీ స్టాల్ లో  కప్పు టీ రూ.15 నుంచి రూ.20 వరకు ఉంది.

దీనిపై ప్రియాంక స్పందిస్తూ.. ‘ఎప్పుడూ నీడపాటున ఉండే నేను.. ఇప్పుడు రోజంతా మండిపోయే వాతావరణంలో స్టాల్ను నడిపిస్తున్నా. సక్సెస్ఫుల్ ‘చాయ్వాలీ’గా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నా.  ప్రతి రోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకెళ్తున్నా’ అని ప్రియాంక పేర్కొంది. బయట ఎంతోమంది చాయ్వాలాలు ఉన్నారని.. అలాంటప్పుడు ఒక చాయ్వాలీ ఉండొద్దా అని ఆమె ప్రశ్నించింది. గుప్తా స్టాల్‌లో టీ తాగుతున్న విద్యార్థుల బృందం ఫోటోలు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి.  నెటిజన్లు ప్రియాంక ప్రయతంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరు బీహార్‌లో చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవని అంటుంటే.. మరికొందరు.. రాబోయే కాలంలో ప్రియాంక బిజినెస్ లో మరింత సక్సెస్ అందుకుని మరికొంతమంది యువతకు ఉద్యోగాలు ఇస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

“ఇప్పుడు, ఆమె రాబోయే కాలంలో ఇతరులకు ఉద్యోగాలు మరియు వ్యాపారం ఇస్తుంది” అని ఒక వినియోగదారు చెప్పారు. ఇది యువతకు “విచారకరమైన” స్థితి అని మరొకరు అన్నారు. మరొక వినియోగదారు ఒక కప్పు టీకి అధిక ధరను సూచించాడు. అయితే ప్రముఖ టీ స్టాల్ వ్యాపార వేత్త.. బిల్లోర్ ప్రియాంక గుప్తాతో కనెక్ట్ కావడానికి సహాయం చేయమని కోరినట్లు తెలుస్తోంది

Also Read:  IPL 2022: సెంచరీతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ కొట్టేశాడు.. కానీ 24 లక్షల ఫైన్‌ కూడా కట్టాడు..!