AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skipping Dinner: రాత్రి భోజనం మానేసి నిద్రపోతే బరువు తగ్గరు.. కానీ ఈ రోగాలు మాత్రం వస్తాయి

బరువు తగ్గాలని రాత్రి భోజనం మానేస్తున్నారా? రాత్రిపూట ఏమీ తినకుండా నిద్రపోవడం ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మెటాబాలిజం దెబ్బతినడం నుంచి నిద్ర నాణ్యత తగ్గడం వరకు అనేక సమస్యలు తలెత్తుతాయి. రాత్రి ఆకలితో పడుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందక ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

Skipping Dinner: రాత్రి భోజనం మానేసి నిద్రపోతే బరువు తగ్గరు.. కానీ ఈ రోగాలు మాత్రం వస్తాయి
Health Risks Of Skipping Dinner
Srilakshmi C
|

Updated on: Jun 15, 2026 | 1:47 PM

Share

చాలామంది పని ఒత్తిడి, అలసట, బరువు తగ్గాలనే ఉద్దేశంతో రాత్రి భోజనం చేయకుండా నిద్రపోతుంటారు. కొందరికి ఇది ఆరోగ్యకరమైన అలవాటుగా అనిపించినా, నిపుణుల అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. రాత్రిపూట పూర్తిగా ఆకలితో పడుకోవడం శరీరంపై ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎసిడిటీ, గుండెల్లో మంట సమస్యలు

ఎక్కువసేపు కడుపు ఖాళీగా ఉండటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా ఎసిడిటీ, గుండెల్లో మంట, కడుపులో మంట, గ్యాస్ట్రైటిస్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఉదయం నిద్రలేచిన తర్వాత తలనొప్పి, వికారం, బలహీనత వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.

నిద్ర నాణ్యత తగ్గే అవకాశం

ఆకలిగా ఉండటం వల్ల రాత్రి గాఢ నిద్ర పట్టకపోవచ్చు. తరచూ మెలకువ రావడం, అర్ధరాత్రి ఆకలి వేయడం, ఉదయం అలసటగా లేవడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మంచి నిద్ర కోసం తేలికపాటి ఆహారం తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పోషకాహార లోపం వచ్చే ప్రమాదం

రాత్రి భోజనం మానేయడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సరైన మోతాదులో అందకపోవచ్చు. దీని వల్ల కండరాల బలహీనత, రోగనిరోధక శక్తి తగ్గడం, తరచూ అలసటగా అనిపించడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.

జీవక్రియపై ప్రభావం

తరచుగా భోజనం మానేయడం వల్ల శరీర జీవక్రియ (మెటాబాలిజం) దెబ్బతినే అవకాశం ఉంది. ఇన్సులిన్ స్థాయిల్లో అసమతుల్యత ఏర్పడి, హార్మోన్ల పనితీరు ప్రభావితమవుతుంది. దీర్ఘకాలంలో ఇది పలు ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.

రాత్రిపూట ఏమి తినాలి?

ఖాళీ కడుపుతో నిద్రపోవడం కంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. కూరగాయల సూప్, ఓట్‌మీల్, పండ్లు, పెరుగు, తక్కువ పరిమాణంలో చపాతీలు లేదా శనగపిండి గంజి వంటి ఆహారాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

నిపుణుల సూచన

రాత్రి భోజనాన్ని పూర్తిగా మానేయడం కంటే, పడుకునే రెండు నుంచి మూడు గంటల ముందు తేలికపాటి మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం ఉత్తమం. బరువు తగ్గాలనుకునేవారు భోజనం మానేయకుండా, సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిం

Follow Us