Viral Fever: వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు స్నానం చేయొచ్చా..? చేయకూడదా..?

|

Oct 06, 2024 | 7:55 PM

ప్రస్తుతం మారుతున్న వాతావరణం వల్ల సీజనల్‌ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగానే ఉంది. కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీలైనంత జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. అందులోనూ కొన్ని ఆరోగ్యకరమైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం బారీ నుంచి సులువుగా బయటపడొచ్చు. వ్యాధుల ప్రమాదాన్నీ తగ్గిస్తుంది..

Viral Fever: వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు స్నానం చేయొచ్చా..? చేయకూడదా..?
Viral Fever
Follow us on

ప్రస్తుతం మారుతున్న వాతావరణం వల్ల సీజనల్‌ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగానే ఉంది. కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీలైనంత జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. అందులోనూ కొన్ని ఆరోగ్యకరమైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం బారీ నుంచి సులువుగా బయటపడొచ్చు. వ్యాధుల ప్రమాదాన్నీ తగ్గిస్తుంది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి వైరల్ ఫీవర్ ముప్పు ఎక్కువైంది. దీంతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ వైరల్ ఫీవర్ బారిన పడుతున్నారు. పదే పదే అనారోగ్యానికి గురవుతున్నాడు. దీనికి ప్రధాన కారణం బ్యాక్టీరియా. మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే, అటువంటి వ్యాధులు మళ్లీ మళ్లీ దాడి చేస్తాయి. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్‌కు నివారణ చాలా ముఖ్యం. జ్వరం వచ్చినప్పుడు ఏం తినాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వైరల్ ఫీవర్ ఉంటే ఏమి తినకూడదు అనే విషయాలు చాలా ముఖ్యం. అలాగే జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయాలా.. వద్దా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

వైరల్ జ్వరం లక్షణాలు..

సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు శరీర నొప్పులు, తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదే వైరల్ ఫీవర్‌ అయితే అలసట మరింత పెరుగుతుంది. బరువు కూడా త్వరగా తగ్గుతారు.

వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు స్నానం చేయాలా వద్దా?

వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు స్నానం చేయడమే ఆరోగ్యకరమని కొందరు వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శరీరంలోని మురికిని తొలగిస్తుంది. మానసిక ప్రశాంతతను అందిస్తుంది. అందువల్ల వైరల్ జ్వరం సమయంలో స్నానం చేయడం సురక్షితం అని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు లేదా వృద్ధులకు వైరల్ జ్వరం ఉంటే, స్నానం చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితిలో, ప్రతి ఒక్కరి పరిస్థితి ఒకేలా ఉండదు. కాబట్టి స్నానం విషయంలో వీరు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో పోరాడుతున్నప్పుడు మన శరీరం ఎక్కువగా శ్రమించకూడదని వైద్యులు చెబుతుంటారు.

ఇవి కూడా చదవండి

వైరల్ ఫీవర్‌ను ఎలా నివారించాలి?

చేతులను క్రమం తప్పకుండా కడుగుతూ ఉండాలి. శుభ్రత పట్ల శ్రద్ధ చాలా అవసరం. వైరస్ మీకు దూరంగా ఉంటే, ఫ్లూ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మనమందరం మన ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. మారుతున్న వాతావరణంలో మాస్క్ ధరించడం కూడా చాలా మంచిది. అలాగే అవసరమైతే వైరల్ జ్వరం ఉన్న రోగులకు వీలైనంత దూరం ఉండాలి. ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.