ఇంట్లో రెండు చీపుళ్ళు కలిపి ఉంచవచ్చా? శాంతి, సంపద కోసం ఇలా చేయండి!

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో రెండు చీపురులను కలిపి ఉంచకూడదు. ఇది నెగెటివ్ ఎనర్జీని పెంచి, ఆర్థిక, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. చీపురును పశ్చిమ దిశలో ఉంచడం శుభప్రదం; దక్షిణ దిశ, వంటగది, పడకగదిలో వద్దు. పాత, విరిగిన చీపురు వాడకం అశుభం. సాయంత్రం, రాత్రి వేళల్లో ఇల్లు ఊడవకూడదు, ఇది లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పిస్తుంది. సరైన వాస్తు నియమాలు పాటించి ఇంట్లో శ్రేయస్సు పొందండి.

ఇంట్లో రెండు చీపుళ్ళు కలిపి ఉంచవచ్చా? శాంతి, సంపద కోసం ఇలా చేయండి!
Broom Vastu Tips

Updated on: Feb 19, 2026 | 1:33 PM

రెండు చీపుళ్ళను ఎప్పుడూ కలిపి ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. దీనివల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీలు ప్రవేశిస్తాయి. చీపురు పరిశుభ్రతకు, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. కాబట్టి రెండు చీపుళ్ళను కలిపి ఉంచితే ఇంట్లో శ్రేయస్సు ఉండదు. వాస్తు దోషాలు ఏర్పడతాయి. వాస్తు ప్రకారం రెండు చీపుళ్ళను కలిపి ఉంచితే ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇంట్లో ఒకే చోట రెండు చీపుళ్ళను కలిపి ఉంచితే వాస్తు దోషాలు ఏర్పడతాయి. ప్రతికూల శక్తి పెరుగుతుంది. దీనివల్ల ఇంట్లో ఉద్రిక్తతలు, గొడవలు జరుగుతాయని అంటున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పశ్చిమ దిశలో చీపురు ఉంచడం శుభప్రదం. కానీ దక్షిణ దిశలో ఎప్పుడూ ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం చీపురుని వంటగదిలో లేదా పడకగదిలో ఉంచకూడదు. ఉంచితే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో బాగా పాడైపోయిన, విరిగిపోయిన చీపురును ఉపయోగించడం కూడా మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పాతగా, విరిగిపోయిన చీపురును వాడడం అశుభసూచకం అంటున్నారు.

ఇకపోతే, ఎప్పుడు పడితే అప్పుడు చీపురుపట్టుకుని ఊడవటం కూడా సరైనది కాదని అంటున్నారు. సాయంత్రం సమయాల్లో చీపురును ఉపయోగించడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని చెబుతున్నారు. రాత్రి సమయంలో ఇల్లు ఊడవడం మంచిదికాదని, ఒకవేళ ఊడ్చినా చెత్త బయటపడవేయరాదని కూడా వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఎల్లప్పుడూ ఆగ్నేయ గోడకు, వాయువ్య గోడల వద్ద మాత్రమే చీపురును పెట్టాలని నిపుణులు అంటున్నారు. ఊడ్చిన తరువాత ఎప్పుడూ చీపురు కనబడకుండా పెట్టాలని చెబుతున్నారు. చెప్పులు కూడా తలుపుల ముందు అస్సలు పెట్టకూడదని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us