
హైదరాబాద్: దేశవ్యాప్తంగా తీర్థయాత్రల సందడి పెరుగుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్‌సిటీ బస్సు ప్రయాణాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ప్రముఖ ఆన్‌లైన్ బస్సు టికెటింగ్ ప్లాట్‌ఫారమ్ ‘రెడ్‌బస్’ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2026 జూన్ 14 నుంచి జూన్ 20 మధ్య కాలంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి జరిగిన బస్సు బుకింగ్‌లు గత ఏడాదితో పోలిస్తే 22 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఇందులో యువతులతదే మెజార్టీ వాటా ఉండటం విశేషం. వారాంతపు విహారయాత్రలు, వేసవి సెలవులు, అలాగే తిరుమలలో నిర్వహించే ‘జ్యేష్ఠాభిషేకం’ వంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ముఖ్యంగా తిరుపతికి వెళ్లే యాత్రికుల సంఖ్య భారీగా పెరిగినట్లు రెడ్‌బస్ వెల్లడించింది.
భారతదేశంలో అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తుల రాకపోకలు నిరంతరం పెరుగుతున్నాయి. జనవరి నుంచి మే 2026 మధ్య కాలంలో తిరుమలలో భక్తులకు 4.4 కోట్లకు పైగా భోజనాలు, పానీయాలు, అందించబడినట్లు సమాచారం. ఇది యాత్రికుల రద్దీ ఎంత అధికంగా ఉందో తెలియజేస్తోంది. ఆధ్యాత్మిక యాత్రలతో పాటు కుటుంబ విహారాలు, విద్యార్థుల ప్రయాణాలు, వీకెండ్ ట్రిప్‌లు కూడా ఇంటర్‌సిటీ బస్సు సేవల వినియోగాన్ని పెంచుతున్నాయి.
రెడ్‌బస్ డేటా ప్రకారం, ప్రయాణికులు సౌకర్యవంతమైన సేవల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మొత్తం బుకింగ్‌లలో 65% ఏసీ బస్సులకే నమోదయ్యాయి. 58% మంది స్లీపర్ బస్సులను, 42% మంది సీటర్ బస్సులను ఎంచుకున్నారు. తిరుపతి వంటి సుదూర, రాత్రి ప్రయాణాల్లో స్లీపర్ బస్సులకు అధిక డిమాండ్ కనిపిస్తోంది.
18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు గల ప్రయాణికులు మొత్తం బుకింగ్‌లలో 47% వాటా కలిగి ఉన్నారు. ఇది యువతలో తీర్థయాత్రలు, వీకెండ్ ట్రావెల్‌పై పెరుగుతున్న ఆసక్తిని సూచిస్తోంది.
ప్రయాణికుల ప్రారంభ గమ్యస్థానాలను పరిశీలిస్తే:
ఇది మెట్రో నగరాలతో పాటు చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా బస్సు ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతున్నట్లు సూచిస్తోంది.
భక్తుల ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు రెడ్‌బస్ ప్రత్యేక రాయితీని ప్రకటించింది. 2026 మే 1 నుంచి జూన్ 30 వరకు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల నుంచి తిరుపతికి ప్రయాణించే వారు redBus వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో “PILGRIM” కోడ్ ఉపయోగిస్తే రూ. 500 వరకు తగ్గింపు పొందవచ్చు.
తీర్థయాత్రలు, వీకెండ్ ట్రిప్‌లు, యువతలో పెరుగుతున్న ప్రయాణ ఆసక్తి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్‌సిటీ బస్సు ప్రయాణాలు కొత్త ఊపును సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా తిరుపతి యాత్రలు ఈ వృద్ధికి ప్రధాన చోదకశక్తిగా మారగా, జెన్ జీ మహిళలు బస్సు బుకింగ్‌లలో కీలక పాత్ర పోషిస్తున్నారని రెడ్‌బస్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.