
వేసవి సెలవుల్లో మీరు టూర్ ప్లాన్ చేస్తుంటే ఈ అందమైన ప్రదేశాలు సందర్శించండి. మరిచిపోలేని అనుభూతి మిగులుతుంది. ఈ ప్రదేశాలలో మీరు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తారు.

రిషికేశ్: సాహసాలను ఇష్టపడే వారికి రిషికేశ్ సూపర్‌గా సెట్ అవుతుంది. ఆధ్యాత్మికతతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఇది మంచి ప్రదేశం. మతపరమైన ప్రదేశాల నుంచి యోగా కేంద్రాలు, రాఫ్టింగ్, అనేక ఇతర సాహస కార్యకలాపాలను మీరు ఇక్కడ ఆస్వాదించవచ్చు. రిషికేశ్‌ను భారతదేశ యోగా రాజధాని అని కూడా పిలుస్తారు.

మనాలి: మనాలి చాలా అందమైన ప్రశాంతమైన హిల్ స్టేషన్. వేసవి సెలవుల్లో ఇక్కడికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. సాహస కార్యకలాపాలు, క్రిస్టల్ క్లియర్ ఫాల్స్, ఆహ్లాదకరమైన వాతావరణం మీ యాత్రను చిరస్మరణీయం చేస్తాయి.

ముస్సోరీ: సెలవు దినాలలో మీరు ముస్సోరీలో చల్లని గాలిని ఆస్వాదించవచ్చు. ఇది నిశ్శబ్ద ప్రదేశం. ప్రతి సంవత్సరం ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ అనేక అందమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు.

ఊటీ: ఊటీ చాలా అందమైన ప్రదేశం. మీరు వేసవి సెలవుల్లో టూర్ ప్లాన్ చేస్తే ఊటీ తప్పనిసరిగా మీ జాబితాలో ఉండాలి. ఈ ప్రాంతంలో యూకలిప్టస్ చెట్లు ఎక్కువగా ఉంటాయి. మీరు ఇక్కడ అందమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు.