జైపూర్ నగరం దేశంలోనే అత్యంత సాంస్కృతిక వారసత్వ సంపద కలిగిన నగరాలలో ఒకటి. అలాంటి జైపూర్ చుట్టూ సాంస్కృతిక వారసత్వం, అందమైన దృశ్యాలు అనేకం కనిపిస్తాయి. అలాంటి అద్బుత దృశ్యాలకు నెలవు సమోద్ గ్రామం. దేశీయ, విదేశీ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది ఈ గ్రామం. సమోద్ గ్రామం చాలా పురాతన వారసత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ, 16వ శతాబ్దంలో రావల్ మహారాజ్ ఇక్కడ కోటను స్థాపించిన తర్వాత దాని నిజమైన చరిత్ర ప్రారంభమైంది. ఈ కోట సమోద్ గ్రామానికి నిజమైన ఆకర్షణగా నిలుస్తుంది. ఇక దీంతో ఇక్కడ అనేక సినిమాలు షూటింగ్‌లు కూడా జరుగుతుంటాయి.
హనుమాన్ ఆలయం: జైపూర్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమోద్ గ్రామానికి సమీపంలో ఉన్న సమోద్ పర్వతం ఎత్తైన శిఖరంపై నిర్మించబడింది ఈ హనుమాన్ ఆలయం. ఇది స్థానికంగా అత్యంత గుర్తింపు, ఆదరణ పొందింది. ఈ ఆలయంలో ఉన్న సుమారు 6 అడుగుల ఎత్తైన హనుమంతుడు సుమారు 700 సంవత్సరాల క్రితం రాతి నుండి ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు. భక్తులు దుర్గమమైన కొండలలో 1100 మెట్లు ఎక్కి ఈ వీర్ హనుమాన్ ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడికి వచ్చిన వారి ప్రతి కోరిక నెరవేరుతుందని స్థానికుల నమ్మకం. ఇది రాజస్థాన్‌లోని ప్రధాన మతపరమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
ఇకపోతే, ఇక్కడి సమోద్ ప్యాలెస్ హెరిటేజ్ హోటల్‌గా మార్చబడింది. ఇందులో బస చేయడం ఒక రాచరిక అనుభవం. ఇక్కడ సాధారణంగా విదేశీ పర్యాటకుల రద్దీ ఉంటుంది. ఇది కాకుండా సమోద్ శీష్ మహల్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడి సంప్రదాయ వాల్ పెయింటింగ్స్, సెక్యూరిటీ గేట్లు మొదలైనవి పర్యాటకులకు ప్రత్యేక ఇష్టమైన పాయింట్లు.
వెడ్డింగ్ నుండి ప్రీ వెడ్డింగ్ షూట్‌ల వరకు అన్నింటికి ఫేమస్..
సమోద్ గ్రామాన్ని రాజస్థానీ సంస్కృతి గురించి తెలుసుకోవాలనుకునే దేశీయ, విదేశీ పర్యాటకులు మాత్రమే కాదు..రాయల్ వెడ్డింగ్‌లు, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్‌లకు కూడా ఫేమస్. ఎప్పుడూ ఏదో ఒక షూటింగ్ సందడి ఉంటుంది. ముఖ్యంగా బన్సా బాగ్ ఆఫ్ సమోద్ హెరిటేజ్ ప్యాలెస్ పర్యాటకులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..