IRCTC: గోవా ఈజ్‌ ఆన్‌.. హైదరాబాద్‌ టు గోవా ఫ్లైట్‌ టూర్.. తక్కువ ఖర్చులోనే..

ఇంతకీ ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ టూర్‌ ప్యాకేజీ వివరాలు ఏంటి.? ప్యాకేజీ ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.. 'గోవా రీట్రీట్‌' పేరుతో ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్‌ నుంచి విమానంలో గోవాకు వెళ్లొచ్చు. ఈ టూర్‌ ప్యాకేజీలో పలు పర్యాటక ప్రాంతాలు కవర్‌ అవుతాయి. 3 రాత్రులు 4 రోజుల పాటు ఉండే ఈ టూర్‌ ప్యాకేజీ నవంబర్‌ 30వ తేదీన అందుబాటులోకి రానుంది. ఈ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు...

IRCTC: గోవా ఈజ్‌ ఆన్‌.. హైదరాబాద్‌ టు గోవా ఫ్లైట్‌ టూర్.. తక్కువ ఖర్చులోనే..
Hyderabad To Goa Tour

Updated on: Nov 06, 2023 | 10:20 PM

స్నేహితులు, కొలిగ్స్‌ ఎప్పటికప్పుడు గోవా టూర్‌ ప్లాన్ వేయాలనే ఆలోచనలో ఉంటారు. ఇందుకోసం ఆరు నెలల ముందు నుంచే ప్లాన్‌ చేసుకుంటుంటారు. ఇలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఈ టూర్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఎలాంటి జంజాటం లేకుండా హాయిగా విమానంలో గోవా వెళ్లే మంచి ఆఫర్‌ను అందిస్తోంది.

ఇంతకీ ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ టూర్‌ ప్యాకేజీ వివరాలు ఏంటి.? ప్యాకేజీ ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.. ‘గోవా రీట్రీట్‌’ పేరుతో ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్‌ నుంచి విమానంలో గోవాకు వెళ్లొచ్చు. ఈ టూర్‌ ప్యాకేజీలో పలు పర్యాటక ప్రాంతాలు కవర్‌ అవుతాయి. 3 రాత్రులు 4 రోజుల పాటు ఉండే ఈ టూర్‌ ప్యాకేజీ నవంబర్‌ 30వ తేదీన అందుబాటులోకి రానుంది. ఈ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర ఎంత.? లాంటి వివరాలు మీకోసం..

టూర్‌లో భాగంగా తొలి రోజు మధ్యాహ్నం రాజీవ్‌ గాంధీ ఎయిర్‌ పోర్ట్ నుంచి బయలుదేరుతారు. మధ్యాహ్నం 2 గంటలకు గోవా ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి హోటల్‌కు బయలుదేరాల్సి ఉంటుంది. రాత్రి హోటల్లో బస చేస్తారు. రెండో రోజు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ చేసిన తర్వాత సౌత్‌ గోవాకు వెళ్తారు. ఓల్గ్‌ గోవా చర్చ్‌, వాక్స్ వరల్డ్ మ్యూజియం, శ్రీ మంగేశ్ టెంపుల్, మీర్మర్ బీచ్ తో పాటు బోట్ క్రూజర్ లో జర్నీ చేస్తారు. రాత్రి సౌత్ గోవాలోనే బస ఉంటుంది.

ఇక మూడో రోజు నార్త్‌ గోవా పర్యటన ఉంటుంది. ఇక్కడ కండోలియం బీచ్, బాగా బీచ్ సందర్శించాల్సి ఉంటుంది. చపోరా ఫోర్ట్ సందర్శన అనంతరం హోటల్ కు వస్తారు. రాత్రి ఇక్కడే బస చేయాల్సి ఉంటుంది. తర్వాతి రోజు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ చేయగానే హోటల్‌ నుంచి చెకవుట్ అవుతారు. మధ్యాహ్నం 02.30 గంటలకు గోవా ఎయిర్ పోర్టు నుంచి తిరుగు ప్రయాణం ఉంటుంది. మధ్యాహ్నం 03.55 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. దీంతో టూర్‌ ముగుస్తుంది. టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..