Mata Vaishno Devi : వైష్ణో దేవి దర్శనంకోసం .. ఐఆర్‌సిటిసి ప్రత్యేక ప్యాకేజీ ప్రారంభం, పూర్తి వివరాలోకి వెళ్తే..!

|

Mar 23, 2021 | 11:18 AM

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీతో ముందుకు వచ్చింది. ఢిల్లీ నుంచి వైష్ణో దేవి ఆలయం...

Mata Vaishno Devi : వైష్ణో దేవి దర్శనంకోసం .. ఐఆర్‌సిటిసి ప్రత్యేక ప్యాకేజీ ప్రారంభం, పూర్తి వివరాలోకి వెళ్తే..!
Mata Vaishno Devi
Follow us on

Mata Vaishno Devi : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీతో ముందుకు వచ్చింది. ఢిల్లీ నుంచి వైష్ణో దేవి ఆలయం సందర్శనం కోసం మాతారాణి రాజధాని టూర్ ప్యాకేజీని ఐఆర్‌సిటిసి విడుదల చేసింది. ఈ ప్రయాణాలు మూడు పగలు, నాలుగు రాత్రులు ఉంటుంది. ఈ ప్రయాణం కోసం మరిన్ని వివరాలను IRCTC యొక్క అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ ను సందర్శించాల్సి ఉంది.

ఈ యాత్రలో యాత్రికులు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి జమ్మూ కత్రాకు వెళతారు. ఈ రైలు వారంలో ప్రతి రోజూ నడుపనున్నామని రైల్వే శాఖ తెలిపింది. ఈ యాత్ర చేసే ప్రయాణీకులకు ప్యాకేజీలో భాగంగా ఆహారం కూడా ఇవ్వబడుతుంది. రెండు సార్లు బ్రేక్‌ఫాస్ట్‌లు, మధ్యాహం భోజనం.. సాయంత్రం విందు అందించనున్నారు. అంతేకాదు.. ప్రయాణీకులకు యాత్ర మరింత సులభతరంగా ఉండడంకోసం హోటల్ లో బస ఏర్పాట్లు కూడా IRCTC వారే చేస్తారు. ఇక తమ సౌకర్యాలను అనుసారించి వివిధ రూపాయలుగా ప్యాకేజీని అందిస్తున్నారు. రూ .4555 నుండి రూ. 7900 ప్యాకేజీలు ప్రయాణీనికులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్యాకేజీ వేసవి నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 21 నుంచి ఈ వైష్ణవి దేవీ యాత్ర ప్రారంభం కానుంది.

రైల్వే కంపార్ట్‌మెంట్‌లో ఒక వ్యక్తి రూ .7,785లు చెల్లించాల్సి ఉండగా.. అదే ఇద్దరు వ్యక్తులకు అయితే రూ .6,170 చెల్లించాల్సి ఉంది. ఇక ట్రిపుల్ షేరింగ్ రూ .5,980లకు లభిస్తుంది. 5 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు రూ. 5,090 చెల్లించాల్సి ఉంది. అదే పిల్లలకు స్పెషల్ బెడ్ లేకుండా అయితే రూ .4,445 ధర చెల్లించాల్సి ఉంది. అయితే పిల్లలకు పూర్తి బెర్త్ కావాలనుకుంటే.. అందుకు పూర్తి చార్జీలను చెల్లించాల్సి ఉంటుందని రైల్వే శాఖ మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.

Also Read: టెస్టులకు వెళ్లిన డాక్టర్ బాబు.. తనకు కార్తీక్ తో పెళ్లి అవుతుందని కలలు కంటున్న మోనిత…!

కొంపల్లిలో విద్యార్థిని అనుమానాస్పద మృతి.. ఎమ్‌ఎల్‌ఆర్ కాలేజీ హాస్టల్ పక్కనే మ‌ృతదేహం గుర్తింపు