
వర్షాకాలం ప్రారంభమైతే కేరళ ప్రకృతి అందాలు మరింత సోయగాన్ని సంతరించుకుంటాయి. పచ్చని కొండలు, మేఘాలను తాకే టీ తోటలు, చిరుజల్లులతో కళకళలాడే లోయలు, ప్రశాంతమైన బ్యాక్‌వాటర్స్.. ఇలా ప్రతి దృశ్యం పర్యాటకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఈ సహజ సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకునే వారి కోసం ఐఆర్‌సీటీసీ (IRCTC) ప్రత్యేకంగా “కేరళ హిల్స్ అండ్ వాటర్” టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల నుంచి ప్రయాణించే వారికి ఈ ప్యాకేజీ మంచి అవకాశంగా చెప్పవచ్చు.
ఈ టూర్‌లో కేరళలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలైన మునార్, అలెప్పీ/కుమరకోం ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. కొండల అందాలు, టీ తోటలు, జాతీయ ఉద్యానవనాలు, ప్రశాంతమైన బ్యాక్‌వాటర్స్‌ను ఒకే ట్రిప్‌లో చూసేలా ఈ ప్యాకేజీ రూపొందించారు.
మంగళవారం మధ్యాహ్నం 20629 రైలు ద్వారా సికింద్రాబాద్ నుంచి కేరళకు ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది.
బుధవారం ఉదయం అలువా రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత ఐఆర్‌సీటీసీ ప్రతినిధులు పర్యాటకులను రిసీవ్ చేస్తారు. అక్కడి నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని మునార్‌కు రోడ్డు మార్గంలో తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్-ఇన్ అనంతరం సాయంత్రం మునార్ పట్టణ పరిసరాలను సందర్శించి అక్కడే బస ఉంటుంది.
ఈ రోజు ఎరవిక్కుళం జాతీయ పార్క్, టీ మ్యూజియం, మెట్టుపట్టి డ్యాం, ఎకో పాయింట్ వంటి ప్రముఖ ఆకర్షణీయ ప్రదేశాలను సందర్శిస్తారు. రాత్రికి మళ్లీ మునార్‌లోనే బస ఉంటుంది.
ఉదయం హోటల్ నుంచి చెక్‌అవుట్ చేసి అలెప్పీకి బయలుదేరుతారు. సుమారు 170 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం అనంతరం అక్కడి ప్రసిద్ధ బ్యాక్‌వాటర్స్ అందాలను వీక్షించే అవకాశం ఉంటుంది. హౌస్‌బోట్ రైడ్ లేదా ఇతర స్థానిక యాక్టివిటీలు కావాలనుకుంటే వాటిని అదనపు చార్జీలతో స్వయంగా బుక్ చేసుకోవచ్చు.
అలెప్పీ నుంచి ఎర్నాకుళం చేరుకుని అక్కడి నుంచి 20630 శబరి ఎక్స్‌ప్రెస్ ద్వారా సికింద్రాబాద్‌కు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.
రాత్రంతా రైలు ప్రయాణం అనంతరం ఆదివారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
గమనిక: అలెప్పీలో హౌస్‌బోట్, బోటింగ్ వంటి కొన్ని స్థానిక కార్యకలాపాలు ప్యాకేజీ ధరలో ఉండకపోవచ్చు. వాటికి అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ టూర్‌కు సంబంధించిన పూర్తి సమాచారం, బుకింగ్ వివరాల కోసం ఐఆర్‌సీటీసీ దక్షిణ మధ్య రైల్వే జోనల్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అలాగే 8287932229, 9701360701 నంబర్లలో కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
ప్యాకేజీ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.