భక్తులకు భారీ గుడ్ న్యూస్.. రూ.14 వేలకే 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్

Updated on: Apr 09, 2026 | 9:15 AM

IRCTC temple tour package: సెలవులు వస్తే చాలు ఏదొక టూరుకు ప్లాన్ చేసుకుని వెళ్తారు. చాలా మంది దేవాలయాలకు వెళ్తుంటారు. ఇక ఇదే సమయంలో , భక్తులకు ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. రూ.14 వేలకే 7 పుణ్యక్షేత్రాలు మొత్తం తిరిగి రావొచ్చు. మరి, ఇంకెందుకు లేట్ ఈ టూర్ ఎప్పటినుంచో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
ఈ స్పెషల్ టూరుకు బుక్ చేసుకున్న భక్తులు మే 24న మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ నుంచి రైలు బయలుదేరుతుంది. జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో  ఈ రైలును ఎక్కాల్సి ఉంటుంది.

2 / 5
రెండో రోజు పర్యాటకులు తిరువణ్ణామలై చేరుకుంటారు. అదే రోజున అరుణాచలేశ్వర ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత  రామేశ్వరానికి బయలుదేరుతారు.

రెండో రోజు పర్యాటకులు తిరువణ్ణామలై చేరుకుంటారు. అదే రోజున అరుణాచలేశ్వర ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత రామేశ్వరానికి బయలుదేరుతారు.

3 / 5
మూడో రోజు కుడల్‌నగర్ రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడి నుంచి రామేశ్వరం తీసుకెళ్తారు. అక్కడ  దర్శనం మొత్తం అయిపోయిన  తర్వాత రామనాథస్వామి ఆలయ దర్శనం ఉంటుంది. దర్శనం అనంతరం ఆ రాత్రికి రామేశ్వరంలో బస చేయాల్సి ఉంటుంది.

4 / 5
ఇక నాలుగో రోజు ఉదయం మదురై బయల్దేరుతారు. అక్కడకి చేరుకున్న తర్వాత మీనాక్షి అమ్మన్ ఆలయ దర్శనంచేసుకున్న తర్వాత   కన్యాకుమారికి తీసుకెళ్తారు.

ఇక నాలుగో రోజు ఉదయం మదురై బయల్దేరుతారు. అక్కడకి చేరుకున్న తర్వాత మీనాక్షి అమ్మన్ ఆలయ దర్శనంచేసుకున్న తర్వాత కన్యాకుమారికి తీసుకెళ్తారు.

5 / 5
ఐదో రోజు కన్యాకుమారిలో గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్ , రాక్ మెమోరియల్ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత తిరుచిరాపల్లికి ప్రయాణం. ఆరో రోజు శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి ఆలయం, తంజావూరు బృహదీశ్వర ఆలయం దర్శనం చేపిస్తారు. 

ఏడో రోజు చిదంబరం నటరాజ ఆలయ దర్శనం ఉంటుంది. ఇలా ఏడూ పుణ్య క్షేత్రాలు దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. పర్యాటకులు తమ ఇళ్లకు చేరుకుంటారు.

ఐదో రోజు కన్యాకుమారిలో గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్ , రాక్ మెమోరియల్ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత తిరుచిరాపల్లికి ప్రయాణం. ఆరో రోజు శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి ఆలయం, తంజావూరు బృహదీశ్వర ఆలయం దర్శనం చేపిస్తారు. ఏడో రోజు చిదంబరం నటరాజ ఆలయ దర్శనం ఉంటుంది. ఇలా ఏడూ పుణ్య క్షేత్రాలు దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. పర్యాటకులు తమ ఇళ్లకు చేరుకుంటారు.

Follow Us