IRCTC Tour: తెలుగు భక్తులకు గుడ్‌న్యూస్.. ఒక్క రైలులోనే తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం దర్శనం!

Hyderabad to Srirangam Train: హైదరాబాద్ భక్తులకు శుభవార్త. ఇప్పటివరకు స్పెషల్ ట్రైన్‌గా నడిచిన చర్లపల్లి–తిరుచురాపల్లి రైలు ఇకపై రెగ్యులర్ సర్వీస్‌గా మారింది. 17077/17078 నంబర్లతో జూలై 7 నుంచి ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి, ప్రతి బుధవారం తిరుచురాపల్లి నుంచి ఈ రైలు నడుస్తుంది. దీంతో హైదరాబాద్ నుంచి శ్రీరంగం వరకు ట్రైన్ మారకుండా నేరుగా వెళ్లే సౌకర్యం కలగనుంది.

IRCTC Tour: తెలుగు భక్తులకు గుడ్‌న్యూస్.. ఒక్క రైలులోనే  తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం దర్శనం!
Hyderabad To Srirangam Train

Updated on: May 29, 2026 | 2:59 PM

హైదరాబాద్ నుంచి శ్రీరంగం వెళ్లే ప్రయాణికులకు ఇకపై పెద్ద ఊరట లభించనుంది. ఇప్పటివరకు స్పెషల్ ట్రైన్‌గా నడిచిన చర్లపల్లి–తిరుచురాపల్లి రైలును దక్షిణ మధ్య రైల్వే రెగ్యులర్ సర్వీస్‌గా మార్చింది. రైలు నంబర్లు 17077/17078తో ఈ సేవ అందుబాటులోకి రానుండగా, తొలి ప్రయాణం జూలై 7న ప్రారంభం కానుంది.

ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి తిరుచురాపల్లి వరకు, ప్రతి బుధవారం తిరుచురాపల్లి నుంచి చర్లపల్లి వరకు ఈ రైలు నడవనుంది. ఈ రైలుతో హైదరాబాద్ నుంచి శ్రీరంగం వరకు ట్రైన్ మారకుండా నేరుగా ప్రయాణించే అవకాశం కలుగుతోంది.


IRCTC Tour

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు వంటి ప్రాంతాల మీదుగా వెళ్లే ఈ రైలు ద్వారా తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సులభంగా చేరుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

17077 చర్లపల్లి–తిరుచురాపల్లి ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారం సాయంత్రం 5:20 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. నల్లగొండ, మిర్యాలగూడ, నడికూడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మార్గంగా మరుసటి రోజు ఉదయం 8:50 గంటలకు తిరుపతి చేరుతుంది. అక్కడి నుంచి చిత్తూరు, కాట్పాడి, వెల్లూరు కంటోన్మెంట్, తిరువన్నామలై, విల్లుపురం, వృద్ధాచలం, అరియలూర్, శ్రీరంగం మీదుగా సాయంత్రం 6:45 గంటలకు తిరుచురాపల్లి చేరుకుంటుంది.

అలాగే 17078 తిరుచురాపల్లి–చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ ప్రతి బుధవారం రాత్రి 9:30 గంటలకు తిరుచురాపల్లి నుంచి బయల్దేరుతుంది. శ్రీరంగం, అరియలూర్, వృద్ధాచలం, విల్లుపురం, తిరువన్నామలై, వెల్లూరు, కాట్పాడి, చిత్తూరు మార్గంగా ఉదయం 7:05 గంటలకు తిరుపతి చేరి, అక్కడి నుంచి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగూడ, నల్లగొండ మీదుగా గురువారం రాత్రి 9:30 గంటలకు చర్లపల్లి చేరుతుంది.

ఈ వారాంత ఎక్స్‌ప్రెస్‌లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు కలిపి మొత్తం పలు కోచ్‌లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.

Follow Us