Summer Tour: మధ్యప్రదేశ్‌లో అందమైన హిల్ స్టేషన్‌లు ఉన్నాయి. వేసవిలో వీటిని చూడటానికి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ హిల్ స్టేషన్లు పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడ మీరు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మరిచిపోలేని అనుభూతులని పొందవచ్చు. మద్యప్రదేశ్ ఓంకారేశ్వర్ కొండ ఓంకారేశ్వర ఆలయానికి ప్రసిద్ధి. ఈ ఆలయం శివునికి అంకితం చేశారు. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ప్రతి సంవత్సరం ఇక్కడికి పెద్ద సంఖ్యలో యాత్రికులు వచ్చి శివుడి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ అమరేశ్వర్ అనే మరో పురాతన దేవాలయం ఉంది. మీరు ఇక్కడ మమలేశ్వర్ జ్యోతిర్లింగ్, గోముఖ్ ఘాట్‌లను సందర్శించవచ్చు. నర్మదా నది అందమైన దృశ్యాలను చూసి ఆనందించవచ్చు. మీరు మీ కుటుంబం, స్నేహితులతో బోటింగ్ వెళ్ళవచ్చు. ఇక్కడి దేవాలయాలు అందమైన శిల్పాలకు ప్రసిద్ధి.
తమియా హిల్ స్టేషన్
మీరు మధ్యప్రదేశ్‌లోని తమియా కొండను సందర్శించవచ్చు. ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. మీరు వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఇక్కడకు వెళ్లవచ్చు. ఇక్కడ పాతాల్‌కోట్ వ్యాలీ, ట్రైబల్ మ్యూజియం, సన్‌సెట్ మ్యూజియం ఉంటాయి.
శివపురి హిల్ స్టేషన్
ఇది మధ్యప్రదేశ్‌లోని అత్యంత ప్రసిద్ధ హిల్ స్టేషన్లలో ఒకటి. ఇది సముద్ర మట్టానికి దాదాపు 462 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది మెరిసే సరస్సులకు ప్రసిద్ధి. ఇందులో జాదవ్ సాగర్ లేక్, చాంద్‌పథ లేక్ ఉంటాయి. ఇది చాలా ప్రశాంతమైన ప్రదేశం. ఇక్కడ మీరు అందమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. శివపురిలో చూడదగిన ప్రదేశాలలో మాధవ్ నేషనల్ పార్క్, బంగంగా టెంపుల్ ఉంటాయి. మీరు స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఇక్కడ బోట్ రైడ్‌ని కూడా ఆస్వాదించవచ్చు.
మండు హిల్ స్టేషన్
మండు మధ్యప్రదేశ్‌లోని ప్రధాన హిల్ స్టేషన్లలో ఒకటి. ఇక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ఇది ఎక్కువగా సందర్శించే హిల్ స్టేషన్లలో ఒకటి. ఇక్కడ అనేక రాజభవనాలు, పురాతన స్మారక చిహ్నాలు ఉంటాయి. ఇక్కడ ఒక సరస్సు కూడా ఉంటుంది. ఇది జంటలకు ఇది మంచి ప్రదేశం. చరిత్రపై ఆసక్తి ఉన్నవారికి ఈ ప్రదేశం చాలా బాగుంటుంది.
మరిన్ని పర్యాటక వార్తలకి ఇక్కడ క్లిక్ చేయండి