ఆ వ్యాధిగ్రస్తులకు దివ్వ ఔషదం.. వీటిని మజ్జిగలో కలిపి తాగితే.. ఆ సమస్యలన్ని తుర్రుమనాల్సిందే!

మన తాతల కాలంలో చాలా మంది ఆహారంలో గంజి లేదా మజ్జిగను ఎక్కువగా తీసుకునే వారు. ఎందుకంటే వీటిలో మన శరీరానికి అవసమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. కానీ కాలక్రమేనా మారుతున్న ఆహారపు అటవాట్ల కారణంగా చాలా మంది ఇప్పుడు మజ్జిగను తాగడం మానేసి జ్యూస్‌లను తీసుకోవడం ప్రారంభించారు. దీని వల్ల మజ్జిగతో కలిగే ప్రయోజనాలను వాళ్లు కోల్పోతున్నారు. కాబట్టి మజ్జిగ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి. మజ్జిగ మనం ఎందుకు తాగాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఆ వ్యాధిగ్రస్తులకు దివ్వ ఔషదం.. వీటిని మజ్జిగలో కలిపి తాగితే.. ఆ సమస్యలన్ని తుర్రుమనాల్సిందే!
Buttermilk Benefits

Updated on: Dec 14, 2025 | 1:34 PM

ఈ మధ్య కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది మజ్జిగను తీసుకోవడం మానేశారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే మజ్జిగతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మన తాతల కాలంలో చాలా మంది ఈ మజ్జిగను ఆహారంలో చేర్చుకోవడంతో ఆరోగ్యంగా, ఎలాంటి వ్యాధుల భారీన పడకుండా ఉండేవారు. మజ్జిగ మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కర స్థాయిను నియంత్రిండంతో పాటు శరీరానికి కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి అనేక పోషకాలను అందిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు మజ్జిగను తమ ఆహారంలో చేర్చుకుంటే ఆ సమస్యకు దూరం చేసుకోవచ్చు.

మజ్జిగలో కరివేపాకు కలపడం

మన శరీరంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే.. మన త్వరగా బలహీనంగా మారిపోతాం. అలాగే ఇది అనేక రకాల వ్యాధులకు దారి తీస్తుంది. ఒక వేళ మీరు అధిక చక్కెరతో బాధపడుతుంటే.. మీరు ఆహారంలో పెరుగుకు బదులుగా మజ్జిగను చేర్చుకోవడం ఉత్తమం. ఎందుకంటే మజ్జిగ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. అయితే మజ్జిగలో కొన్ని కరివేపాకులు కలుపుకొని తాగడం వల్ల దాని ప్రయోజనాలను మరింత పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

కరివేపాకు మజ్జిగ ప్రయోజనాలు

కరివేపాకు కలిపిన మజ్జిగను తాగడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందుకోసం మనం ఒక గ్లాసు మజ్జిగలో 10 నుండి 15 కరివేపాకు ఆకులు వేసి, మూతపెట్టి, దాదాపు 1 గంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత దాన్ని ఆహారంలో కలిపి తీసుకున్నా, లేదా నేరుగా తాగినా వాటి ప్రయోజనాలు మనం పొందచ్చు. కరివేపాకు మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిచడంతో పాటు మూత్రపిండాల్లో రాళ్లకు కూడా తొలగిస్తుంది. అలాగే మన కంటి చూపును మెరుగు పరుస్తుంది. మీ జుట్టు సమస్యను తగ్గిస్తుంది.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం కొన్ని నివేదికలు, ఇంటర్నెట్ ఆధారంగా అందించబడినవి. వీటిని టీవీ9 దృవీకరించలేదు. వీటిని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి.