
ఆరోగ్యకరమైన జీవితానికి నిద్ర అనేది చాలా కీలకం. అయితే, ప్రస్తుతం లైఫ్‌స్టైల్ కారణంగా చాలా మంది నిద్రలేమి లేదా నాణ్యత లేని నిద్రతో బాధపడుతున్నారు. అయితే రాత్రి పడుకునే ముందు మనం తీసుకునే భారీ ఆహారపు అలవాట్లే నిద్రను ప్రభావితం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, ముఖ్యంగా రాత్రి 9 లేదా 10 గంటలకు తినడం వల్ల జీర్ణవ్యవస్థకు అధిక భారం పడుతుందని, ఇది గాఢ నిద్రకు ఆటంకం కలిగిస్తుందని చెబుతున్నారు. కాబట్టి సుఖవంతమైన నిద్రకోసం ఈ టిప్స్ పాటించాలని సూచిస్తున్నారు.
ఆరోగ్యమైన నిద్ర కోసం ఈ టిప్స్ తప్పక పాటించండి
ఉపవాసం: మనకు నిద్ర సరిగ్గా పట్టాలంటే మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం వారంలో ఒక రోజు ఉపవాసం ఉండాలని, ఇది మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఉపవాసం ఉన్న రోజు తనే కలిపిన నీరు, లేదా నిమ్మకాయ నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఆకలి అనిపించినా, తేనె నిమ్మరసం నీళ్లు ఆకలిని తగ్గిస్తాయని. ఖాళీ కడుపుతో నిద్ర పట్టదు అనుకోవడం అపోహ అని చెబుతున్నారు.
అలవాటు లేని వారికి కొద్ది నిమిషాలు ఆలస్యమైనా, నిద్ర పడితే అది చాలా గాఢంగా ఉంటుందని చెబుతున్నారు. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు జీర్ణవ్యవస్థ విశ్రాంతి తీసుకుంటుందని. ఊపిరితిత్తులు తక్కువ పని చేస్తాయి, గుండెపై భారం తగ్గుతుందని చెబుతున్నారు. అన్ని అవయవాలు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు శరీరం పూర్తిగా రిలాక్స్ అయి గాఢ నిద్రను పొందవచ్చంటున్నారు.
జ్యూస్ ఉపవాసం: మీకు తేనె నీళ్ల ఉపవాసం కష్టంగా ఉంటే దాని ప్లేస్‌లో మీరు జ్యూస్ తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పద్ధతిలో ఉదయం 9, మధ్యాహ్నం 12, సాయంత్రం 3, రాత్రి 7 గంటలకు పండ్ల రసాలు లేదా కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చని సూచిస్తున్నారు. ఉడికిన ఆహారం, ఉప్పు, నూనెలు లేకుండా రసాలపై ఆధారపడటం వల్ల పొట్ట సౌకర్యవంతంగా ఉంటుందని.. ఇవి పాటించినప్పుడూ మీ నిద్రలో మార్పులు గమనించాలని చూసిస్తున్నారు.
ఫ్రూట్ ఫాస్టింగ్: కొంత మందికి జ్యూస్ తాగడం ఇష్టం ఉండదు. అలాంటి వారికి ఫ్రూట్ ఫాస్టింగ్ మంచి ఎంపిక అని చెపుతున్నారు. ఈ పద్ధతిలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ లలో కేవలం పండ్లు మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. ఇవి పాటించినప్పుడు కూడా మీరు గాఢ నిద్రను పొందుతారని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ బిర్యానీలు, నాన్‌వెజ్ వంటి భారీ ఆహారాలు తీసుకుని పడుకున్నప్పుడు కలిగే నిద్రతో పోల్చి చూస్తే ఈ ఉపవాస పద్ధతుల ద్వారా కలిగే నిద్రలోని తేడాను స్పష్టంగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.