ఘాటైన కెమికల్ స్ప్రేలతో పనిలేదు..ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే బొద్దింకలు మళ్లీ ఇంట్లో కనిపించవు!

ప్రతి ఇంట్లోనూ ఎదురయ్యే ప్రధాన సమస్య బొద్దింకలు. ఇవి చీకటిగా, తేమగా ఉన్న మూలల్లో చేరుతూ ఆహారాన్ని కలుషితం చేస్తాయి. మార్కెట్లో దొరికే మందుల వాసన మన ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే, ఖరీదైన కెమికల్ స్ప్రేలు వాడకుండా ఇంట్లోని వస్తువులతోనే వీటిని వదిలించుకోవచ్చు. ఇంట్లో సులభంగా లభించే వస్తువులతోనే బొద్దింకలను ఎలా తరిమికొట్టవచ్చో ఈ కథనంలో చూద్దాం.

ఘాటైన కెమికల్ స్ప్రేలతో పనిలేదు..ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే బొద్దింకలు మళ్లీ ఇంట్లో కనిపించవు!
Cockroaches

Updated on: Mar 25, 2026 | 3:35 PM

ఇంట్లో బొద్దింకలు ఉన్నాయంటే అవి కేవలం అసహ్యం కలిగించడమే కాకుండా, ఇంట్లో బొద్దింకలు ఉంటే అవి అనేక వ్యాధులకు కారణమవుతాయి. టైఫాయిడ్, కలరా వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కూడా తెచ్చిపెడతాయి. మార్కెట్లో దొరికే రసాయన స్ప్రేలు వాడితే మన ఆరోగ్యానికి కూడా హాని కలిగే అవకాశం ఉంది. అందుకే, వంటింట్లో దొరికే వస్తువులతోనే బొద్దింకలను ఎలా వదిలించుకోవాలో కొన్ని స్మార్ట్ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. ఖరీదైన కెమికల్ స్ప్రేలు వాడకుండా ఇంట్లోని వస్తువులతోనే వీటిని వదిలించుకోవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం…

బేకింగ్ సోడా, పంచదార: బొద్దింకలను ఆకర్షించడానికి పంచదార, వాటిని చంపడానికి బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. ఈ రెండింటిని సమానంగా కలిపి బొద్దింకలు తిరిగే చోట చల్లండి. పంచదార తినడానికి వచ్చే బొద్దింకలు సోడా ప్రభావంతో చనిపోతాయి.

బోరిక్ యాసిడ్: బొద్దింకల నివారణకు ఇది అత్యంత శక్తివంతమైన మార్గం. కొంచెం గోధుమ పిండి, పంచదార, బోరిక్ యాసిడ్ కలిపి చిన్న చిన్న ఉండలుగా చేయండి. వీటిని గది మూలల్లో, సింక్ కింద ఉంచితే బొద్దింకల సమస్య త్వరగా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

బిర్యానీ ఆకు (Bay Leaves): బిర్యానీ ఆకులో ఉండే ఘాటైన వాసన బొద్దింకలకు నచ్చదు. కొన్ని బిర్యానీ ఆకులను నలిపి ఆ పొడిని కబోర్డ్స్‌లో లేదా షెల్ఫ్‌లలో వేయండి. ఆ వాసన భరించలేక అవి అక్కడి నుండి పారిపోతాయి.

వేప (Neem): వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కీటకాలను చంపేస్తాయి. వేప నూనెను నీటిలో కలిపి స్ప్రే చేయడం లేదా వేప పొడిని చల్లడం ద్వారా బొద్దింకల సంతతిని అదుపు చేయవచ్చు.

లవంగాలు (Cloves):
లవంగాల వాసన కూడా బొద్దింకలను దూరం చేస్తుంది. వంటగది మూలల్లో లేదా అల్మారాల్లో కొన్ని లవంగాలను ఉంచడం వల్ల అవి ఆ ప్రాంతానికి రావు.

నీలగిరి నూనె (Eucalyptus Oil): నీలగిరి నూనెను నీటిలో కలిపి బొద్దింకలు వచ్చే రంధ్రాల దగ్గర స్ప్రే చేయండి. దీని ఘాటైన సువాసన బొద్దింకలకు వికర్షకంలా పనిచేస్తుంది.

పరిశుభ్రత ముఖ్యం:

అన్నిటికంటే ముఖ్యంగా వంటగదిని రాత్రిపూట శుభ్రం చేయాలి. తిన్న ప్లేట్లు సింక్‌లో ఉంచకూడదు మరియు తడి లేకుండా పొడిగా ఉంచాలి. ఆహార కణాలు లేకపోతే బొద్దింకలు పెరగవు. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే, మీ ఇల్లు బొద్దింకల రహితంగా మారుతుంది!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us