Easy Floor Cleaning Tips: మీ ఇంట్లో టైల్స్ తళతళలాడాలంటే.. ఇలా క్లీన్ చేయండి! మొండి మరకలు క్షణాల్లో మాయం

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలంటే ప్రతిరోజూ నేలను ఊడ్చి, తడి గుడ్డతో తుడవాల్సి ఉంటుంది. లేకపోతే సూక్ష్మక్రిములు నేలపై స్థిరపడటమే కాకుండా, మరకలు ధూళి కారణంగా టైల్స్, గ్రానైట్ అందం కూడా దెబ్బతింటుంది. రోజురోజుకీ వాటి మెరుపుతగ్గి మరకలు పేరుకుపోతాయి. అందుకే ప్రతిరోజూ నేలను తుడుచుకోవాలి..

Easy Floor Cleaning Tips: మీ ఇంట్లో టైల్స్ తళతళలాడాలంటే.. ఇలా క్లీన్ చేయండి! మొండి మరకలు క్షణాల్లో మాయం
Floor Cleaning Tips

Updated on: Feb 15, 2026 | 5:50 PM

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకు ప్రతిరోజూ నేలను ఊడ్చి, తడి గుడ్డతో తుడవాల్సి ఉంటుంది. లేకపోతే సూక్ష్మక్రిములు నేలపై స్థిరపడటమే కాకుండా, మరకలు ధూళి కారణంగా టైల్స్, గ్రానైట్ అందం కూడా దెబ్బతింటుంది. రోజురోజుకీ వాటి మెరుపుతగ్గి మరకలు పేరుకుపోతాయి. అందుకే ప్రతిరోజూ నేలను తుడుచుకోవాలి. అయితే ఒక్కోసారి ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఫ్లోర్‌ తుడిచినా కూడా టైల్స్‌పై అంటుకున్న మరకలు పోవడం లేదని చాలా మంది ఫిర్యాదు చేస్తుంటారు. ఇటువంటి పరిస్థితిలో ఖరీదైన క్లీనర్‌లను ఉపయోగించే బదులు ఇంట్లో లభించే ఈ చిన్న చిన్న వస్తువులతో ఇంటిని నిమిషాల్లోనే తళతళలాడించేయొచ్చు.

ఫ్లోర్‌ఫై మొండి మరకలను ఎలా వదిలించుకోవాలంటే?

ఉప్పు – షాంపూ

నేల తుడుచుకోవడానికి ఉపయోగించే నీటిలో ఒక టీస్పూన్ రాక్ సాల్ట్, షాంపూ కలపండి. షాంపూకు బదులుగా లిక్విడ్ హ్యాండ్ వాష్‌ కూడా ఉపయోగించవచ్చు. ఇది నేలపై మరకలు, దుర్వాసనలను సులభంగా తొలగిస్తుంది. పైగా ఫ్లోర్‌ శుభ్రమై మెరుపును పెంచడానికి సహాయపడుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల టైల్స్ పసుపు రంగులోకి మారకుండా నిరోధించవచ్చు.

బేకింగ్ సోడా-పేస్ట్

నేలపై పాత మొండి మరకలను తొలగించడానికి.. కప్పులో కొంచెం నీళ్లు, బేకింగ్ సోడా కలిపి మందపాటి పేస్ట్ తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను మరకలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి ఆ తరువాత తడి గుడ్డతో స్క్రబ్ చేయాలి. ఇది మరకలను సులభంగా తొలగిస్తుంది.

ఇవి కూడా చదవండి

గోరువెచ్చని నీళ్లు

గోరువెచ్చని నీటితో నేలను తుడుచుకోవడం వల్ల పేరుకుపోయిన దుమ్ము త్వరగా తొలగిపోయి నేల శుభ్రంగా కనిపిస్తుంది. ఈ పద్ధతి రోజువారీ శుభ్రపరచడానికి మంచిది. కావాలనుకుంటే ఈ నీటిలో కొన్ని చుక్కల నిమ్మరసం కూడా జోడించవచ్చు. ఇది తేలికపాటి తాజా సువాసనను ఇస్తుంది.

వెనిగర్

వెనిగర్ ఓ సహజ క్లీనర్. నేలను తుడుచుకోవడానికి నీటితో ఇది కలిపి శుభ్రం చేయడం వల్ల మరకలు, ధూళి సులభంగా తొలగిపోతాయి. ఇది టైల్స్, పాలరాయిపై మరకల తొలగింపుకు చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.

ఎసెన్షియల్‌ నూనెలు

మీ ఇంట్లో శాశ్వత సువాసన కావాలంటే తుడవడానికి వినియోగించే నీటిలో కొన్ని చుక్కల లావెండర్ లేదా ఇతర ఎసెన్షియల్‌ నూనెలను జోడించవచ్చు. ఇది ఇంటికి సువాసన, సానుకూల శక్తిని జోడిస్తుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.