
అధిక రక్తపోటు కారణంగా హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యల్ని కలిగిస్తుంది. అయితే మీరు కూడా హైబీపీ పేషెంట్ అయితే మాత్రం బాదం పప్పును తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బీపీ మందులను వాడుతూ బాదం పప్పులను తినడం చాలా డేంజర్ అంటున్నారు.

బాదం పప్పులను అమితంగా తీసుకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కొంత మంది వ్యక్తులకు బాదం అలెర్జీ ఉంటుంది. మోతాదుకు మించి తీసుకుంటే వారు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు కూడా బాదంపప్పులు తినడం మంచిది కాదు

కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు కూడా బాదంపప్పులు తినడం మంచిది కాదు. వీటిలో ఆక్సలేట్ సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లోకి చేరితే కాలుష్యం పేరుకుపోయి రాళ్లుగా ఏర్పడతాయి. అలానే కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు వీటిని తింటే అప్పటికే రాళ్లు ఉంటే వాటి పరిమాణం పెరిగే అవకాశం లేకపోలేదు.

ఈరోజుల్లో చాలామంది అజీర్తి కడుపునొప్పి ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు ఇలాంటి వాళ్లు బాగా ఎక్కువగా తినకూడదు. బాదంపప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇవి వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల కడుపులో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. కడుపునొప్పి గ్యాస్ సమస్యలు మరింత తీవ్రమయ్యే ఛాన్స్ ఉంది.

అధిక బరువు లేదా ఉబకాయ సమస్యతో బాధపడేవారు సైతం బాదాం పప్పుల జోలికి పోకూడదు. బాదం పప్పులో కేలరీలు సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి ఇవి త్వరగా బర్ను కావు దీంతో వీటిని ఎక్కువగా తినడం వల్ల బరువు మరింత పెరిగే ప్రమాదం ఉంది అందుకే వీటిని ఎక్కువగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు.