Dengue: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? డెంగ్యూతో బాధపడుతున్నట్లే..

ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే డెంగ్యూ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ ఏటా దాదాపు 40 కోట్ల మంది ఈ వ్యాధిబారిన పడుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. ఏడిస్‌ జాతికి చెందిన దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. అయితే చాలా వరకు డెంగ్యూ లక్షణాలు సాధారణ...

Dengue: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? డెంగ్యూతో బాధపడుతున్నట్లే..
Dengue
Follow us

|

Updated on: Jul 06, 2024 | 4:37 PM

వర్షా కాలం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. అయితే వర్షాకాలం తనతో పాటు ఎన్నో రకాల వ్యాధులను వెంటబెట్టుకొని వస్తుంటుంది. దీంట్లో ప్రధానమైన వ్యాధుల్లో డెంగ్యూ ఒకటి. ఇప్పటికే చాలా చోట్ల డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయానికి కూడా దారి తీస్తుంది.

ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే డెంగ్యూ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ ఏటా దాదాపు 40 కోట్ల మంది ఈ వ్యాధిబారిన పడుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. ఏడిస్‌ జాతికి చెందిన దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. అయితే చాలా వరకు డెంగ్యూ లక్షణాలు సాధారణ జ్వరాన్ని పోలి ఉండడంతో మొదట్లో గుర్తించడం కష్టంగా ఉంటుంది.

అయితే కొన్ని రకాల లక్షణాల ద్వారా డెంగ్యూను తొలుత గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే సింపుల్‌గా బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. డెంగ్యూ సోకిన వారిలో ప్రాథమిక కనిపించే లక్షణాల్లో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డెంగ్యూ రాగానే శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. తీవ్రమైన తలనొప్పి వేధిస్తుంది. కళ్లలో అసౌకర్యంగా ఉంటుంది. అలాగే కీళ్లు, కండరాల నొప్పి విపరీతంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చర్మంపై దద్దుర్లు, రక్తస్రావం వంటి లక్షణాలు సైతం కనిపిస్తాయి.

దోమకాటు తర్వాత సాధారణంగా 4 నుంచి 10 రోజుల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా డెంగ్యూ వచ్చిన వారికి శరీర ఉష్ణోగ్రత 104 ° F వరకు చేరుకుంటుంది. కాబట్టి రెండు రోజులకు మించి జ్వరం ఉంటే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. ఈ వ్యాధి బారినపడకుండా ఉండాలంటే వర్షాకాలంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.

ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దీనివల్ల దోమలు పెరుగుతాయి. అలాగే శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి. జంక్‌ పుడ్‌కు దూరంగా ఉండాలి. కూరగాయలను జాగ్రత్తగా కడిగి తీసుకోవాలి. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..