చుక్కకూర తింటే శరీరంలో జరిగే మార్పులివే..
Narender Vaitla
04 October
2024
చుక్కకూరలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారు కూడా ఆహారంలో చుక్కకూరను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడంలో తోడ్పడుతుంది.
చుక్క కూరను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తనాళాల పొరల్లో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరిగేలా చేస్తుంది. ఇది బీపీని కంట్రోల్ చేయడంలో దోహదపడుతుంది.
గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా చుక్కకూర ఉపయోగపడుతుంది. గుండెకు రక్త సరఫరా చేసే నాళాలలో పూడికలు లేకుండా చూస్తుంది.
చుక్కకూరను క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మహిళలకు వచ్చే రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వంటివి దరిచేరకుండా ఉంటాయి.
రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా చుక్కకూర కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తరచూ వచ్చే వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు.
చుక్కకూరలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..