డయాబెటిస్ బాధితులకు నానబెట్టిన మెంతులు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా రక్తంలో షుగర్ లెవల్స్‌ను క్రమబద్దీకరించడంలో సహాయపడతాయి. వీటిలోని గాలాక్టోమన్నాన్స్ రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది.
జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే నానబెట్టిన మెంతులను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడంలో దోహదపడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు కూడా నానబెట్టిన మెంతులను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పడగడుపున నానబెట్టిన మెంతులను తింటే త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో నానబెట్టిన మెంతులు తోడ్పవుతాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి.
చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా ఇవి తోడ్పడుతాయి. వీటిలో నుంచి తీసిన రాసాన్ని ముఖానికి అప్లై చేస్తే చర్మం మెరిసిపోతుంది.
మెంతులను తిన్నా, వాటిని పేస్టుగా చేసుకొని తలకు అప్లై చేసుకున్నా జుట్టు రాలడాన్ని నియంత్రించవచ్చు. ఇందులోని ప్రోటీన్లు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
మహిళల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా మెంతులు ఉపయోగపడతాయి. ముఖ్యంగా నెలసరి సమస్యలు, పీసీఓఎస్ సమస్యలను నియంత్రించడంలో సహాయడపతాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.