
తెల్ల గలిజేరు.. చూసేందుకు ఇదేదో పిచ్చిమొక్కల కనిపిస్తుంది. కానీ, ఆరోగ్య పరంగా ఇది సంజీవని వంటిది. ఆయుర్వేదంలో దీనిని పునర్నవ అని పిలుస్తారు. పాడైపోయిన శరీర అవయవాలకు మళ్ళీ కొత్త జీవం పోసేది అని అర్థం. ఇది సాక్షాత్తూ ప్రకృతి ప్రసాదించిన సంజీవనిగా మన పెద్దలు చెబుతుంటారు. ఔషదపరంగా ఇది ఎంతో ప్రముఖ్యత కలిగినది. గలిజేరు రెండు రకాలుగా దొరుకుతుంది. ఒకటి తెల్ల గలిజేరు, రెండు ఎర్ర గలిజేరు. తెల్ల గలిజేరు ఉపయోగాలు తెలుసా?
పునర్నవ లేదా గలిజేరు. ఈ మొక్క భూమి పిచ్చిమొక్కలా కనిపిస్తుంది కానీ ఇందులో అద్భుతమైన ఔషధీయ విలువలున్నాయి. పునర్నవ మొక్క ఎరుపు, నలుపు, తెలుపు రంగుల్లో వుంటుంది. అయితే, తెలుపు మొక్క ఉత్తమం అంటారు. తెల్లగలిజేరును వేడి నీటిలో మరిగించి తాగితే కఫం, దగ్గు, పాండు రోగాలు, వాత వ్యాధులు నయమవుతాయి. మూత్రపిండాలను బాగు చేసి సక్రమంగా పనిచేసేలా పునర్నవ దోహదం చేస్తుంది.
తెల్ల గలిజేరు ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి. పునర్నవ మొక్కను నూరి రసం తీసి దానికి సమంగా నువ్వుల నూనెని కలిపి నూనె మిగిలేదాకా సన్నని సెగపై కాచి వాత నొప్పులకు రాస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. తీవ్రమైన గుండె సమస్యలున్నవారు, రక్తపోటు, మధుమేహం వున్నవారు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. పాలిచ్చే తల్లులు, గర్భిణీలు పునర్నవ ఆకు కూరను తినకూడదు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..