
భారతీయుల ఇళ్లలో ఉదయం, సాయంత్రం టీ కాచడం అత్యంత సాధారణమైన విషయం. అయితే, ప్రతిరోజూ టీ వడకట్టడం వల్ల ఆ గరిటెలకు టీ పొడి రంగు, పాలు, జిడ్డు పేరుకుపోయి అవి నల్లగా మారిపోతుంటాయి. క్రమంగా ఈ మురికి పేరుకుపోయి వడకట్టే చిన్న చిన్న రంధ్రాలన్నీ మూసుకుపోతాయి. సాధారణ డిష్ వాష్ సోప్‌తో తోమినా ఇవి అంత సులభంగా వదలవు. ఇంట్లో దొరికే కొన్ని సాధారణ వస్తువులతో ఈ నల్లటి మరకలను వదిలించి, మూసుకుపోయిన రంధ్రాలను క్లియర్ చేయడానికి కొన్ని అద్భుతమైన హోమ్ రెమెడీస్ ఇక్కడ చూద్దాం.
ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకుని, అందులో ఒక చెంచా బేకింగ్ సోడా, రెండు చెంచాల వైట్ వెనిగర్ కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో టీ వడకట్టే గరిటెను ముంచి 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. వెనిగర్, బేకింగ్ సోడా చర్య వల్ల రంధ్రాలలో పేరుకుపోయిన మురికి మెత్తబడుతుంది. ఆ తర్వాత పాత టూత్ బ్రష్‌తో కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ వేసి రుద్దితే నల్లటి మరకలన్నీ వదిలిపోయి గరిటె కొత్తదానిలా మెరుస్తుంది.
మీ ఇంట్లో ఉండేది స్టీల్ వడకట్టే గరిటె అయితే, దాన్ని శుభ్రం చేయడానికి ఒక సులువైన మార్గం ఉంది. స్టవ్ ఆన్ చేసి మంటను సిమ్‌లో పెట్టాలి. వడకట్టే స్టీల్ జల్లెడను నేరుగా మంటపై కొద్ది సెకన్ల పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల రంధ్రాలలో గట్టిగా పేరుకుపోయిన టీ పొడి జిడ్డు మాడిపోతుంది. ఈ పద్ధతిని ప్లాస్టిక్ వాటికి అస్సలు ఉపయోగించకూడదు. అలాగే స్టీల్ దానికి ప్లాస్టిక్ హ్యాండిల్ ఉంటే అది కాలిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. వేడి చేసిన తర్వాత గరిటెను కిందకు దించి, ఒక పాత బ్రష్‌తో మెల్లగా రుద్దితే మాడిన మురికి పొడిలా రాలిపోతుంది. ఆపై సోప్ నీటితో కడిగితే సరిపోతుంది.
ప్రతిసారి టీ వడకట్టిన వెంటనే ఆ గరిటెను అలాగే వదిలేయకుండా, కనీసం నల్లా కింద పెట్టి ఒకసారి కడిగేస్తే రంధ్రాలలో మురికి పేరుకుపోకుండా ఉంటుంది. ఈ చిన్న చిట్కాలను పాటిస్తే మీ వంటింట్లోని టీ వడకట్టె జల్లెడ ఎల్లప్పుడూ శుభ్రంగా, సురక్షితంగా, సరికొత్తగా మెరుస్తూ ఉంటాయి!
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..