
గోంగూర చికెన్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: అరకిలో చికెన్ , మూడు కట్టలు గోంగూర ఆకులు, రెండు ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి , రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు , అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు , కొద్దిగా నూనె , ఇంకా కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.

గోంగూర చికెన్ తయారీ విధానం: ముందుగా గోంగూర ఆకులను తీసుకుని వాటిని బాగా కడిగి ఆ నీటిని పూర్తిగా వంపేయాలి. ఆ తర్వాత పాన్‌లో ఆయిల్ లేకుండా 10 నిమిషాలు బాగా వేయించి అది చల్లారిన తరవాత దానిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దీ సేపటి తరవాత చికెన్ మేరినేట్ చేయాలి. ఇలా చేస్తే మంచి రుచి వస్తుంది.

కడిగిన చికెన్ తీసుకుని దానిలో కొద్దిగా ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 15 నిమిషాల పాటు వీటికి పట్టించి పక్కన పెట్టాలి. ఇప్పుడు మసాలాలు కూడా బాగా వేయించాలి. పాన్ లో ఆయిల్ వేసి అది బాగా వేడి అయినా తరవాత దానిలో కొద్దిగా కరివేపాకు, నాలుగు పచ్చిమిర్చి, ఇంకా రెండు ఉల్లిపాయలు కూడా వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

ఆ తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు బాగా కలపాలి ఆ తరవాత దీనిలో చికెన్ కూడా వేసి కనీసం 10 నిమిషాల పాటు బాగా వేయించాలి. ఆ తరవాత దీనిలో ఇంకా రెండు టమాటాలు, కొద్దిగా కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు కూడా వేసి కలపాలి.

చివర్లో గోంగూర వేసి కలపాలి : ముందుగా పేస్ట్ లాగా పెట్టుకున్న గోంగూరను తీసుకుని చికెన్‌లో వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇంకా మీడియం మంట పై సరిగ్గా 20 నిమిషాల పాటు ఉడికించాలి. ఇంకా చివర్లో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. దించే ముందు కొత్తిమీర చల్లి వేడి వేడి అన్నంలో తింటే రుచిగా ఉంటుంది.