AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భోజనం చేసే సమయంలో చెమట పడితే డయాబెటిస్ వస్తుందా?

కొంత మందికి భోజనం చేసేటప్పుడు చెమట పడుతుంది. ముఖ్యంగా నుదిటిపై చెమట ఎక్కువగా పడుతుంది. వేడి ఆహారం తినడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని అందరూ అనుకుంటారు. కానీ మీరు చల్లగా ఏదైనా తిన్నప్పుడు లేదా తాగిన ప్రతిసారీ ఇలా జరిగితే లేదా చలికాలంలో కూడా ఇలా చెమట పడుతుంటే అది సాధారణం కాదు..

భోజనం చేసే సమయంలో చెమట పడితే డయాబెటిస్ వస్తుందా?
Sweating While Eating
Srilakshmi C
|

Updated on: Feb 06, 2026 | 9:23 PM

Share

కొంతమంది తినేటప్పుడు చెమట పట్టడం మీరు గమనించి ఉంటారు. కొంతమందికి తక్కువ మొత్తంలో చెమట పడుతుంటే, మరికొందరికి ఏకదాటిగా చెమట పడుతుంది. ముఖ్యంగా నుదిటిపై చెమట ఎక్కువగా పడుతుంది. వేడి ఆహారం తినడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని అందరూ అనుకుంటారు. కానీ మీరు చల్లగా ఏదైనా తిన్నప్పుడు లేదా తాగిన ప్రతిసారీ ఇలా జరిగితే లేదా చలికాలంలో కూడా ఇలా చెమట పడుతుంటే అది సాధారణం కాదు. కాబట్టి దీనికి కారణం ఏమిటి? ఇది ఏదైనా వ్యాధికి సంకేతమా? నిపుణులు దాని గురించి ఏమి చెబుతున్నారో? ఇక్కడ తెలుసుకుందాం..

ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ హిమాన్షు భదాని మాట్లాడుతూ.. తినేటప్పుడు చెమట పట్టే సమస్యను వైద్యపరంగా గస్టేటరీ చెమట అని పిలుస్తారు. అధిక కారంగా ఉండే ఆహారం తిన్నప్పుడు శరీరం చెమట పట్టడం ప్రారంభిస్తుంది. ఇది సాధారణంగా వెచ్చని శరీరం ఉన్నవారిలో కనిపిస్తుంది. తినేటప్పుడు చెమట పట్టడం కొందరికి సాధారణం. కానీ మరికొందరికి ఇది వివిధ వ్యాధుల లక్షణం కావచ్చు.

భోజనం చేసేటప్పుడు చెమటలు పట్టడం మధుమేహ లక్షణమా?

డాక్టర్ హిమాన్షు మాట్లాడుతూ భోజనం చేసేటప్పుడు చెమటలు పట్టడం మధుమేహం ప్రారంభ లక్షణం కావచ్చు. ఎవరికైనా డయాబెటిస్ ఉంటే అది నరాల దెబ్బతినడానికి కారణమవుతుంది. కాబట్టి ఇది భోజనం చేసేటప్పుడు చెమట పట్టడానికి దారితీస్తుంది. కానీ ఇది అన్ని సందర్భాల్లోనూ జరగదు. కొందరికి ఇది థైరాయిడ్ లేదా హార్మోన్ల మార్పుల వల్ల కూడా జరగవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ సమస్య పిల్లలకు వస్తుందా?

పెద్దల మాదిరిగానే పిల్లలు కూడా తినేటప్పుడు చెమట పట్టవచ్చు. పిల్లలు కారంగా ఉండే ఆహారం తిన్నప్పుడు, దానిని జీర్ణం చేసుకోవడానికి వారి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది చెమట పట్టడానికి దారితీస్తుంది. అయితే సాధారణ ఆహారం తిన్నప్పుడు కూడా పిల్లలకు చెమటలు పడుతుంటే లేదా వేగంగా బరువు తగ్గుతుంటే, తినేటప్పుడు వారి హృదయ స్పందన రేటు పెరగకపోతే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

భోజనం చేసేటప్పుడు చెమట పట్టకుండా ఉండేందుకు ఏం చేయాలి?

  • కారంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి.
  • మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.
  • రోజుకు కనీసం 7 గ్లాసుల నీళ్లు తాగాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
పరగడుపున ఉప్పు నీళ్లు తాగుతున్నారా? శరీరంలో జరిగే మార్పులివే..
పరగడుపున ఉప్పు నీళ్లు తాగుతున్నారా? శరీరంలో జరిగే మార్పులివే..
‘యేషనాగుల కట్టమీద' సాంగ్‌కు శ్రీముఖి తీన్మార్ స్టెప్పులు.. వీడియో
‘యేషనాగుల కట్టమీద' సాంగ్‌కు శ్రీముఖి తీన్మార్ స్టెప్పులు.. వీడియో
ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు.. గురువారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే
ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు.. గురువారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే
బంగారం ధరలు భారీగా డౌన్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరలు భారీగా డౌన్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
జస్ట్ రెండు స్పూన్స్ తింటే.. చచ్చుబడిన నరాలు కూడా బలంగా
జస్ట్ రెండు స్పూన్స్ తింటే.. చచ్చుబడిన నరాలు కూడా బలంగా
'పంజా' సెకెండ్ హీరోయిన్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్
'పంజా' సెకెండ్ హీరోయిన్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్
స్వీట్లపై మెరిసే వెండి పూత ఏంటో తెలుసా? తింటే సేఫేనా.. అసలు విషయం
స్వీట్లపై మెరిసే వెండి పూత ఏంటో తెలుసా? తింటే సేఫేనా.. అసలు విషయం
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్..
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్..
ఎల్‌నినో మాయాజాలమా? పర్యావరణంలో మార్పులా?
ఎల్‌నినో మాయాజాలమా? పర్యావరణంలో మార్పులా?
చికెన్ ఖలేజా ఇలా చేస్తే.. హోటల్ రుచి ఇంట్లోనే!
చికెన్ ఖలేజా ఇలా చేస్తే.. హోటల్ రుచి ఇంట్లోనే!