Home Garden Care:వేసవిలో మీ తోట పచ్చగా ఉండాలా? ఈ గార్డెనింగ్ చిట్కాలు మీ కోసమే!

ఎండలు ముదురుతున్న సమయంలో మనుషులకే కాదు, మొక్కలకు కూడా ప్రత్యేక రక్షణ అవసరం. వేసవి వేడికి మట్టి త్వరగా ఎండిపోయి మొక్కలు నీరసించిపోతుంటాయి. వేసవి ఎండల నుండి మీ ఇంటి మొక్కలను కాపాడుకోవడానికి అనుసరించాల్సిన ముఖ్యమైన చిట్కాలు తెలిస్తే మీ బాల్కనీ, లేదా గార్డన్‌లోని మొక్కలు నిత్యం పచ్చగా పూలు, పండ్లతో కళకళలాడుతుంది. మీ ఇంటి మొక్కలను ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇక్కడ కొన్ని ఉత్తమ చిట్కాలు ఉన్నాయి.

Home Garden Care:వేసవిలో మీ తోట పచ్చగా ఉండాలా? ఈ గార్డెనింగ్ చిట్కాలు మీ కోసమే!
Plant Care In Summer

Updated on: Apr 28, 2026 | 9:13 PM

వేసవి తీవ్రత పెరిగే కొద్దీ తోటలోని మొక్కలు వాడిపోవడం సహజం. ఎండల వేడి నుండి మొక్కలను రక్షించుకోవడానికి, వాటిని పచ్చగా ఉంచుకోవడానికి సరైన సమయం లో నీరు పెట్టడం, కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా నీరు పెట్టే సమయం, మల్చింగ్ (Mulching) పద్ధతి, మొక్కలకు అవసరమైన నీడను కల్పించడం వంటి అంశాలపై తప్పనిసరిగా దృష్టిపెట్టాలి. మధ్యాహ్నం వేళ నీరు పెట్టడం కంటే ఉదయం లేదా సాయంత్రం వేళల్లో నీరు అందించడం వల్ల మొక్కలు తేమను ఎక్కువ కాలం నిలుపుకుంటాయి. అలాగే, కుండీల్లో పెంచే మొక్కల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలి. అవన్నీ ఇప్పుడు చూద్దాం..

నీరు పెట్టడానికి సరైన సమయం: వేసవిలో మొక్కలకు నీరు పోయడానికి ఉత్తమ సమయం సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత. మధ్యాహ్నం వేళ నీరు పోయడం వల్ల ఎండ వేడికి ఆ నీరు ఆవిరైపోతుంది. మొక్కల వేర్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఉదయాన్నే నీరు పోయడం వల్ల రోజంతా మొక్కకు అవసరమైన తేమ అందుతుంది.

మల్చింగ్ (Mulching) చేయండి: మట్టిలోని తేమ త్వరగా ఆవిరి కాకుండా ఉండటానికి కుండీలోని మట్టిపై ఎండిన ఆకులు, గడ్డి లేదా కొబ్బరి పీచును ఒక పొరలా పరచండి. దీనిని మల్చింగ్ అంటారు. ఇది మట్టిని చల్లగా ఉంచడమే కాకుండా, కలుపు మొక్కలు పెరగకుండా చూస్తుంది.

ఇవి కూడా చదవండి

గ్రీన్ నెట్ లేదా నీడ కల్పించడం: నేరుగా ఎండ తగిలే చోట ఉన్న మొక్కల పైన గ్రీన్ నెట్ ఏర్పాటు చేయడం వల్ల ఎండ తీవ్రతను 50శాతం వరకు తగ్గించవచ్చు. ముఖ్యంగా సున్నితమైన ఇండోర్ ప్లాంట్స్ లేదా ఆకుకూరల మొక్కలకు ఇది ఎంతో అవసరం.

గ్రూపింగ్ (Grouping): కుండీలను విడివిడిగా ఉంచడం కంటే, వాటన్నింటినీ ఒకే దగ్గర గుంపుగా చేర్చడం వల్ల వాటి చుట్టూ తేమ శాతం (Humidity) పెరుగుతుంది. దీనివల్ల మొక్కలు త్వరగా ఎండిపోవు.

ఎరువుల విషయంలో జాగ్రత్త: వేసవిలో మొక్కలకు అధిక మోతాదులో రసాయన ఎరువులు వేయకూడదు. ఎందుకంటే ఎరువులు మొక్కలో వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఒకవేళ ఎరువులు వేయాల్సి వస్తే, సహజ సిద్ధమైన ద్రవ రూప ఎరువులను సాయంత్రం వేళల్లో తక్కువ మోతాదులో వాడండి.

కుండీల మార్పు: ప్లాస్టిక్ కుండీల కంటే మట్టి కుండీలు వేసవికి ఉత్తమం. మట్టి కుండీలు లోపల మట్టిని చల్లగా ఉంచుతాయి. ఈ సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా మండు వేసవిలో కూడా మీ ఇంటి తోటను ఒక పచ్చని నందనవనంలా మార్చుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us