How to Eat Mangoes: నీళ్లలో నానబెట్టకుండా మామిడి పండ్లు తింటున్నారా? జాగ్రత్త..బరువు పెరుగుతారట

వేసవిలో మాత్రమే దర్శనమిచ్చే మామిడి పండ్ల కోసం ఏడాదంతా ఆశగా ఎదురు చూసే వారు మనలో చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం వేసవి నడుస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటిపోతున్నాయి. రకరకాల మామిడి పండ్లు మార్కెట్లో కొలువుదీరాయి. పండిన మామిడికాయలు కూడా మార్కెట్‌లో దొరుకుతున్నాయి. ఇంత వేడిలో మామిడి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా అని చాలా మంది భావిస్తుంటారు. నిజానికి, ఈ సీజనల్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో..

How to Eat Mangoes: నీళ్లలో నానబెట్టకుండా మామిడి పండ్లు తింటున్నారా? జాగ్రత్త..బరువు పెరుగుతారట
How To Eat Mangoes
Follow us

|

Updated on: May 09, 2024 | 8:22 PM

వేసవిలో మాత్రమే దర్శనమిచ్చే మామిడి పండ్ల కోసం ఏడాదంతా ఆశగా ఎదురు చూసే వారు మనలో చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం వేసవి నడుస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటిపోతున్నాయి. రకరకాల మామిడి పండ్లు మార్కెట్లో కొలువుదీరాయి. పండిన మామిడికాయలు కూడా మార్కెట్‌లో దొరుకుతున్నాయి. ఇంత వేడిలో మామిడి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా అని చాలా మంది భావిస్తుంటారు. నిజానికి, ఈ సీజనల్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ పండ్లను తినే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్‌లో మామిడి పండ్లను కొన్న తర్వాత బాగా కడగడం మర్చిపోకూడదు. అంతకంటే ముందు ఓ గంట పాటు నీళ్లలో వీటిని నానబెట్టాలి. పండిన మామిడి పండ్లను ఎల్లప్పుడూ నీళ్లలో నానబెట్టి తినాలని చెబుతున్నారు నిపుణులు. కానీ ఎందుకు నాళ్లలో నానబెట్టాలి? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నిపుణుల మాటల్లో మీకోసం..

నిజానికి, మామిడి తొక్కలో ఫైటిక్ యాసిడ్ అనే యాంటీ న్యూట్రియంట్ ఉంటుంది. ఈ ఫైటిక్ యాసిడ్ శరీరానికి హానికరం. ఇది శరీరం పోషకాలను గ్రహించకుండా నిరోధిస్తుంది. ఫైటిక్ యాసిడ్‌ ఐరన్‌, జింక్, కాల్షియం వంటి ముఖ్యమైన మూలకాల శోషణను నిరోధిస్తుంది. మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల ఈ ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. అంతేకాకుండా మామిడి తొక్కలో చాలా హానికరమైన పదార్థాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలుకు బదులు కీడు చేస్తాయి. చర్మం కూడా సమస్యలకు గురవుతుంది. మొటిమలు, దద్దుర్లు, ప్రేగు సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు నివారించడానికి మామిడి పండ్లను నీటిలో నానబెట్టాలి.

నేటి కాలంలో మార్కెట్‌లో లభించే కూరగాయలు, పండ్లు చాలా వరకు రసాయనాలతో నిండి ఉంటున్నాయి. ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి పురుగుమందులు వినియోగిస్తున్నారు. మామిడిపండ్లపై కూడా అనేక రకాల రసాయనాలు వేస్తారు. అవి శ్వాసలోపం, వికారం, తలనొప్పి సమస్యను పెంచుతాయి. మామిడికాయలను ఒక గంటపాటు నీటిలో నానబెట్టడం వల్ల ఈ హానికరమైన అంశాలు తొలగిపోతాయి. మామిడికాయ తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అయితే వేసవిలో శరీరాన్ని ఎంత చల్లగా ఉంచుకుంటే అంత మంచిది. బదులుగా మామిడికాయలను నీటిలో గంటసేపు నానబెట్టడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. అలాగే మామిడిలో ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఈ రసాయనం శరీరంలో కొవ్వును పెంచుతుంది. అందుకే నీళ్లలో నానబెట్టాలి. మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల ఈ ఫైటోకెమికల్స్ గాఢత తగ్గుతుంది. మామిడి పండు తిన్నాక కొవ్వు పేరుకుపోయే అవకాశం కూడా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతుంటే సింపుల్ టిప్స్ మీ కోసం
నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతుంటే సింపుల్ టిప్స్ మీ కోసం
ఆ రెండు స్థానాలు బెట్టింగ్ రాయుళ్ల హాట్ సీట్లు.. ఫలితాలపై ఉత్కంఠ.
ఆ రెండు స్థానాలు బెట్టింగ్ రాయుళ్ల హాట్ సీట్లు.. ఫలితాలపై ఉత్కంఠ.
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ..పేరేంటంటే?
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ..పేరేంటంటే?
ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్.. దేశంలోని ఎయిర్ పోర్ట్‎లలో హై అలర్ట్..
ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్.. దేశంలోని ఎయిర్ పోర్ట్‎లలో హై అలర్ట్..
పెరుగుతో వీటిని కలిపి తీసుకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే..
పెరుగుతో వీటిని కలిపి తీసుకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే..
మట్టి పాత్రల్లో వంట చేస్తే అంత ఆరోగ్యం దాగి ఉందా? డోంట్ మిస్..
మట్టి పాత్రల్లో వంట చేస్తే అంత ఆరోగ్యం దాగి ఉందా? డోంట్ మిస్..
ఆధార్‌ దుర్వినియోగం కేసులో ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా..?
ఆధార్‌ దుర్వినియోగం కేసులో ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా..?
లేడీస్ అనుకుంటే ఆగమైనట్లే.. కన్నేసి వస్తారు.. ఆ తర్వాతే అసలు కథ..
లేడీస్ అనుకుంటే ఆగమైనట్లే.. కన్నేసి వస్తారు.. ఆ తర్వాతే అసలు కథ..
బేబీ బంప్‌తో ఓటు వేసిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే..
బేబీ బంప్‌తో ఓటు వేసిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే..
ఈ టిప్స్ పాటించారంటే.. మీ స్టవ్ తళతళ మెరవాల్సిందే!
ఈ టిప్స్ పాటించారంటే.. మీ స్టవ్ తళతళ మెరవాల్సిందే!
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?