Fast Eating: స్పీడ్‌ స్పీడ్‌గా తింటున్నారా? తస్మాత్‌ జాగ్రత్త.. మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, ప్రజలు భోజనంతో సహా ప్రతిదీ త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆఫీసు పనుల ఒత్తిడి, మొబైల్ ఫోన్ల అతిగా వాడకం, టైం లేకపోవడం వల్ల ప్రజలు తొందర, తొందరగా ఎలా పడితే అలా తింటున్నారు. అలాగే కొన్ని సార్లు టీవీ, లేదా ఫోన్‌ చూస్తూ భోజనం చేస్తారు. ఈ అలవాటు క్రమంగా శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తినేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. త్వరగా తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

Fast Eating: స్పీడ్‌ స్పీడ్‌గా తింటున్నారా? తస్మాత్‌ జాగ్రత్త.. మీరు డేంజర్‌లో ఉన్నట్టే!
Fast Eating

Updated on: Apr 16, 2026 | 2:56 PM

కొంత మందికి త్వరత్వరగా తినే అలవాటు ఉంటుంది. ఇలా వేగంగా తినడం వల్ల శరీరం నుండి కడుపు నిండింది అనే సరైన సంకేతం అందదు. దీనివల్ల మనం తినాల్సిన దాని కన్నా ఎక్కవ ఆహారం తినే అవకాశం ఉంటుంది. ఈ అలవాటు వల్ల ఊబకాయం, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. కాలక్రమేణా, ఈ అలవాటు శరీర శక్తిని, సహన శక్తిని తగ్గిస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

వేగంగా తినడం ఆరోగ్యానికి ఎలా హాని చేస్తుంది?

ఆర్‌ఎంఎల్ ఆసుపత్రి మెడికల్ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సుభాష్ గిరి ప్రకారం, వేగంగా తినడం కేవలం ఊబకాయానికే పరిమితం కాదని.. ఇది శరీరంలోని అనేక భాగాలను దెబ్బతీస్తుందని చెబుతున్నారు. ఇది జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. దీనివల్ల మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయిని చెబుతున్నారు. అలాగే ఇన్సులిన్ స్థాయిలలో అస్థిరత ఏర్పడి, టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని.. అవసరానికి మించి క్యాలరీలు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మెటబాలిజం నెమ్మదించడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. దీని వల్ల దీర్ఘకాలంలో హార్మోన్ల ఇబ్బందులు, అలసట పెరుగువచ్చని హెచ్చరిస్తున్నారు.

ఈ అలవాటును మార్చుకోవడం ఎలా?

మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ అలవాటును మనం నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. తినేప్పుడు ఆహారాన్ని బాగా నమిలి, నెమ్మదిగా మింగాలని ఇలా చేయడం ద్వారా కడుపు నిండినట్లు మెదడుకు సరైన సమయంలో సంకేతాలు అందుతాయని చెబుతున్నారు.అలాగే తినేప్పుడు టీవీ లేదా మొబైల్ ఫోన్ వాడడం ఆపమని చెబుతున్నారు. భోజనం మధ్యలో చిన్న విరామం తీసుకోవడం, కొద్దిగా నీరు త్రాగడం ప్రయోజనకరంగా ఉందంటున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us