Health Tips: ఈ టిప్స్ పాటిస్తే మీ శృంగార జీవితం మరింత మధురం అవుతుంది..

శృంగారాన్ని మనస్పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే ముందు మనసులోని భయాలకు బ్రేక్ వేయాలి. భాగస్వామి స్వేచ్ఛగా మూవ్ అయ్యేలా స్పేస్ ఇవ్వాలి. వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం. ఇక మంచి ఫుడ్ తీసుకుంటే స్టామినా పెరుగుతుంది.

Health Tips: ఈ టిప్స్ పాటిస్తే మీ  శృంగార జీవితం మరింత మధురం అవుతుంది..
representative image

Updated on: Jul 31, 2022 | 3:51 PM

Romantic Moments: లైఫ్‌ స్పాన్ పెరగాలంటే ఏం చెయ్యాలి..? దీనికి సమాధానం క్వాలిటీ ఆఫ్ లైఫ్‌పై డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం చెప్పాలంటే.. స్మోకింగ్‌కు గుడ్ బై చెప్పాలి.  అతిగా అలవాటు ఉన్నవారు ఆల్కాహాల్‌ను అకేషన్స్‌కే పరిమితం చెయ్యాలి. యోగా, వ్యాయామం మస్ట్. మంచి నిద్ర ఉండాలి. డ్రగ్స్‌కు నో చెప్పాలి. స్ట్రస్, యాంగ్జైటీ నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి. మన చుట్టూ ఉండే అట్మాస్పియర్ కూడా బాగుండాలి. వీటన్నింటితో పాటు ఆయుష్షు పెరగాలంటే శృంగారం కూడా కీ రోల్ పోషిస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అవును దాంపత్య జీవితంలో  శృంగారం చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. సెక్స్ అనేది ఒక ఎమోషనల్ ఫిజికల్ బాండింగ్. ఆరోగ్యకరమైన శృంగారంలో పాల్గొనడం వల్ల మనసు తేలిక పడుతుంది. ఇది ఒక ఎక్సర్‌సైజ్‌లా కూడా యూజ్ అవుతుంది. హార్ట్ హెల్త్‌కు మంచింది. ఇమ్యూనిటీ పవర్‌ పెరుగుతుంది. అయితే శృంగార జీవితాన్ని మరింత మధురంగా మార్చుకోవాలంటే.. వర్కవుట్స్‌తో పాటు డైలీ రొటీన్ అనేది కూడా ఇంపార్టెంట్.

  •  జీడిపప్పు, అక్రోట్ల, బాదం వంటి డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఎనర్టీ పెరుగుతుంది. భావప్రాప్తి సమయంలో నిలకడగా ఉండేందుకు ఇవి సాయపడతాయి
  • డైలీ వర్కువట్ చేయడం వల్ల.. బాడీ ఫిట్‌గా తయారవుతుంది. అప్పుడు సెల్ఫ్ కాన్పిడెన్స్ పెరుగుతుంది. అలాగే పార్టనర్‌కు ఆకర్షణ పెరిగేలా సాయపడుతుంది.
  • శృంగారంపై ఇంట్రెస్ట్ కోల్పోయేలా చేసేది మెయిన్‌గా స్ట్రస్. ముందు పర్సనల్, ప్రొఫెషనల్‌ ఒత్తిళ్లను దూరం చేయాలి. అందుకు కూడా మెడిసిన్ వర్కవుట్స్‌
  •   చికెన్ వంటి వాటిల్లో ఫినైల్‌అలనైన్‌, టైరోసైన్‌ వంటి ఉంటాయి. ఇది సెక్స్‌పై ఇంట్రస్ట్ పెరిగేలా చేస్తాయి.
  • ఫిష్,  సోయా  వంటివి శృంగార హార్మోన్లను అధికం చేస్తాయి
  •  పెరుగు, గుడ్లు వంటివి రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటే శృంగార జీవితానికి చాలా మంచింది.
  • అలాగే పార్టనల్ ఇష్టాఇష్టాలు.. వాళ్ల భావాలు, మూడ్ వంటివి కూడా పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాలి
  • సెక్స్‌వల్ లైఫ్‌కు, పర్సనల్ నీట్‌నెస్‌కు చాలా దగ్గరి రిలేషన్ ఉంటుంది.  వ్యక్తిగత పరిశుభ్రత లైంగిక జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి సాయపడుతుందని చాలా రీసెర్స్‌లు చెబుతున్నాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు పలు అధ్యయనాలు, ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. వీటి ఫాలో అయ్యే ముందు  వైద్య నిపుణులను కన్సల్ట్ అవ్వండి)

మరిన్ని హెల్త్ వార్తల కోసం..