Wearing Socks: సాక్సులకు, నిద్రకు లింకేంటి! గాఢ నిద్ర కోసం వేసుకోవాలా? వద్దా?

చలికాలం వచ్చిందంటే చాలు.. రాత్రి వేళ పాదాలు ఐస్ ముక్కల్లా చల్లబడిపోతుంటాయి. ఆ చలిని తట్టుకోవడానికి చాలా మంది సాక్సులు వేసుకుని పడుకుంటారు. మరికొందరు ఇది ఆరోగ్యానికి మంచిది కాదు అని వాదిస్తుంటారు. అసలు రాత్రి పూట సాక్సులు ధరించి నిద్రపోవడం వల్ల ..

Wearing Socks: సాక్సులకు, నిద్రకు లింకేంటి! గాఢ నిద్ర కోసం వేసుకోవాలా? వద్దా?
Socks.

Updated on: Dec 21, 2025 | 9:30 PM

చలికాలం వచ్చిందంటే చాలు.. రాత్రి వేళ పాదాలు ఐస్ ముక్కల్లా చల్లబడిపోతుంటాయి. ఆ చలిని తట్టుకోవడానికి చాలా మంది సాక్సులు వేసుకుని పడుకుంటారు. మరికొందరు ఇది ఆరోగ్యానికి మంచిది కాదు అని వాదిస్తుంటారు. అసలు రాత్రి పూట సాక్సులు ధరించి నిద్రపోవడం వల్ల మన శరీరంలో ఏం జరుగుతుంది? దీనివల్ల కలిగే ప్రయోజనాలు, జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

  • సైన్స్ ప్రకారం, మన పాదాలు వెచ్చగా ఉన్నప్పుడు మెదడుకు “శరీరం రిలాక్స్ అయ్యింది” అనే సంకేతం అందుతుంది. దీనిని ‘వాసోడైలేషన్’ అంటారు. సాక్సులు వేసుకోవడం వల్ల పాదాల్లోని రక్తనాళాలు వ్యాకోచించి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా మారి, మీరు త్వరగా గాఢ నిద్రలోకి జారుకుంటారు.
  •  శీతాకాలంలో చాలా మందికి పాదాల పగుళ్లు ఇబ్బంది పెడుతుంటాయి. రాత్రి పూట పాదాలకు మంచి మాయిశ్చరైజర్ లేదా ఆయిల్ రాసి, పైన కాటన్ సాక్సులు వేసుకుంటే.. తేమ చర్మంలోనే ఉండి పాదాలు మృదువుగా మారుతాయి.
  •  కొందరికి చలి వల్ల చేతులు, కాళ్లు నీలం రంగులోకి మారి మొద్దుబారిపోతుంటాయి. అలాంటి వారికి సాక్సులు ధరించడం వల్ల పాదాల ఉష్ణోగ్రత స్థిరంగా ఉండి, రక్త ప్రసరణకు ఎలాంటి ఆటంకం కలగదు.

లాభాలు ఉన్నాయని ఎలా పడితే అలా సాక్సులు వేసుకోకూడదు. కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు తప్పవు.

  •  మరీ టైట్‌గా ఉండే సాక్సులు వేసుకుంటే రక్త ప్రసరణ ఆగిపోయే ప్రమాదం ఉంది. ఎప్పుడూ లూజ్‌గా ఉండే సాక్సులనే ఎంచుకోవాలి.
  •  రోజంతా వాడిన సాక్సులనే రాత్రి కూడా వేసుకోవద్దు. దీనివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. నిద్రపోయే ముందు శుభ్రమైన, కొత్త సాక్సులు ధరించాలి.
  • సింథటిక్ లేదా నైలాన్ సాక్సుల కంటే కాటన్ లేదా ఉన్ని సాక్సులు శ్రేయస్కరం. ఇవి పాదాలకు గాలి ఆడేలా చూస్తాయి.
    రాత్రి పూట సాక్సులు వేసుకుని పడుకోవడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుందనేది వాస్తవం. అయితే పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తేనే అది ఆరోగ్యానికి మంచిది. ఇకపై చలి రాత్రుల్లో హాయిగా నిద్రపోవాలంటే ఒక జత కాటన్ సాక్సులను సిద్ధం చేసుకోండి!