Remove Stretch Marks: ప్రెగ్నెన్సీ అనేది స్త్రీకి సంతోషకరమైన అనుభూతి. అయితే అదే సమయంలో శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వాటిలో ఒకటి స్ట్రెచ్ మార్క్స్. సకాలంలో అవసరమైన చర్యలు చేపట్టకపోతే.. ఆ సమస్యలను త్వరగా వదిలించుకోలేరు. నిజానికి, శిశువు కడుపులో పెరిగినప్పుడు ఉదర కండరాలు విస్తరిస్తాయి. అందువల్ల చర్మంపై సాగిన గుర్తులు(స్ట్రెచ్ మార్క్స్) కనిపిస్తాయి. ఇవి చూడటానికి అందవిహీనంగా కనిపిస్తాయి. వీటికి సకాలంలో చర్యలు చేపట్టకపోతే.. అంత తేలికగా పోవు. అయితే, ఈ స్ట్రెచ్ మార్క్స్ పొట్ట మీదనే కాదు.. తొడలు, భుజాలు, నడుము చుట్టు కూడా వస్తాయి. ఈ స్ట్రెచ్ మార్కులను తగ్గించడంలో సహాయపడే కొన్ని నేచురల్ టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
నిమ్మ, సోడా..
ఒక టీస్పూన్ నిమ్మరసంలో బేకింగ్ సోడా మిక్స్ చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. స్క్రబ్ చేసి తేలికగా మసాజ్ చేయాలి. పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ రెమెడీని వారానికి మూడు నాలుగు సార్లు చేస్తే కొద్ది రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి. నిమ్మ, బేకింగ్ సోడాలో బ్లీచింగ్ ఏజెంట్లు ఉంటాయి. ఇది చర్మంపై మచ్చలను తగ్గించడంలో సహాయపడుతాయి.
చందనం, పసుపు..
ఒరిజినల్ చందనాన్ని గ్రైండ్ చేసి పొడి చేయాలి. ఆ పొడిలో పసుపు వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రాసి ఆరనివ్వాలి. అది ఆరిన తర్వాత కడగాలి. ఇలా తరచుగా చేయడం వల్ల సాగిన గుర్తులు పోతాయి.
ఆయిల్ మసాజ్..
పొట్టపై సాగిన గుర్తులు కనిపిస్తే.. ఆయిల్ మసాజ్ చేయడం చాలా ఉపయుక్తం. నూనె సహాయంతో చర్మం తేమ, పోషణను పొందుతుంది. తద్వారా లోతైన గుర్తులు ఉండవు. కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ నూనెతో రోజుకు కనీసం రెండుసార్లు మసాజ్ చేయడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ తొలగిపోతాయి.
కలబంద..
అలోవెరా జెల్ సహజమైన యాంటీరింక్ల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పొట్టపై ఉన్న స్ట్రెచ్ మార్క్స్‌ను తొలగించడానికి అలోవెరా జెల్‌ను రోజూ మసాజ్ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. కొన్ని రోజుల్లోనే ఆ గుర్తులు మసకబారడం ప్రారంభమవుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..