10 రోజులకు ఒకసారి ఈ ఆకుకూర తింటే శరీరంలో జరిగేది అద్భుతమే..! తప్పక ట్రై చేయండి..

ఎర్ర తోటకూర అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలకు నిలయం. విటమిన్లు, కాల్షియం, ఫైబర్ సమృద్ధిగా ఉండే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. రక్తపోటును నియంత్రించి, గుండె, ఎముకలు, కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచి, క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది. వారానికి రెండుసార్లు దీనిని తినడం వల్ల శరీరంలో సానుకూల మార్పులు కలుగుతాయి.

10 రోజులకు ఒకసారి ఈ ఆకుకూర తింటే శరీరంలో జరిగేది అద్భుతమే..! తప్పక ట్రై చేయండి..
Red Amaranth

Updated on: Dec 08, 2025 | 2:27 PM

ఎన్నో రకాల ఆకుకూరల్లో ఎర్రతోట కూర కూడా ఒకటి. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. వారంలో రెండు సార్లు ఎర్ర తోటకూర తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వారంలో ఒక్కసారైనా ఎర్ర తోటకూర తింటే మీ శరీరంలో కలిగే మార్పులు మీరు ఊహించలేరు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎర్రతోట కూరలో విటమిన్ ఎ, సి, ఇ, బి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైరర్, ప్రోటీన్‌లు పుష్కలం. ఇది ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.

ఎర్ర తోటకూర జీర్ణ సమస్యలను సులభతరం చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను, మలబద్ధకం,గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం చేయడానికి సహాయపడుతుంది. ఎర్రతోట కూర తినడం వలన పేగు ఆరోగ్యంతో పాటు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారు ఎర్ర తోట కూర తింటే మంచిది. కంటి ఆరోగ్యానికి ఎర్ర తోటకూర చాలా మంచిది. కంటి చూపు, కంటి,చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి ఎర్ర తోటకూర ఎంతగానో ఉపయోగపడుతుంది.

రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచడంలో ఎర్ర తోట కూర సహాయపడుతుంది. గొంతు క్యాన్సర్‌ను రాకుండా అడ్డుకుంటుంది. సీజనల్‌ వైరల్ ఇన్ఫెక్షన్లతో ఎర్రతోట కూర పోరాడుతుంది. ఎర్ర తోటకూరలో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతాయి. ఎర్ర తోటకూర ఫైబర్‌కి మూలం. వీటి ఆకులు నుంచి కాండం వరకూ అన్నీ పోషకాలతో వుంటాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఎర్ర తోటకూర తింటే ఎంతో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యానికి, అధిక రక్తపోటు అదుపునకు ఎర్ర తోటకూర తింటే మంచిది. వృద్ధాప్య లక్షణాలను దూరం చేసి.. చర్మంపై ముడతలు, మొటిమలను పొగొట్టి ముఖాన్ని అందంగా కాంతివంతంగా ఉండేలా ఎర్ర తోటకూర చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..