Lifestyle: వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి

ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. దీంతో ప్రజలు ఎండ నుంచి ఉపశమనం లభించేందుకు రకరకాల చిట్కాలను పాటిస్తున్నారు. వేసవిలో ఉల్లిపాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని మీకు తెలుసా.? ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు...

Lifestyle: వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి
Raw Onions
Follow us

|

Updated on: Apr 23, 2024 | 3:45 PM

ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. దీంతో ప్రజలు ఎండ నుంచి ఉపశమనం లభించేందుకు రకరకాల చిట్కాలను పాటిస్తున్నారు. వేసవిలో ఉల్లిపాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని మీకు తెలుసా.? ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత ఇలాగే వచ్చింది. మరీ ముఖ్యంగా సమ్మర్‌లో పచ్చి ఉల్లిపాయను తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని ఎంతో ఉపయోగమని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఎండాకాలంలో సహజంగా గురయ్యే వడదెబ్బకు పచ్చి ఉల్లిపాయ దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. అధిక ఉష్ణోగ్రత నుంచి రక్షించుకోవడానికి ఉల్లిపాయలు ఎంతగానో ఉపయోగపడతాయిని నిపుణులు చెబుతున్నారు.

* ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఇందులోని సెలీనియం అనే మూలకం రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో సమ్మర్‌లో తరచూ వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

* వేసవిలో చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారికి ఉల్లిపాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఉల్లిపాయను తీసుకోవడం వల్ల అజీర్తి సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. ఇక పచ్చి ఉల్లిపాయ, నిమ్మరసం కలిపిన సలాడ్ తీసుకుంటే జీర్ణశక్తి పెరిగి, పొట్ట సమస్యలు దరిచేరవు.

* ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేసవి కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు పచ్చి ఉల్లిపాయ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చక్కెర స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. సల్ఫర్, క్వెర్సెటిన్ వంటి యాంటీ-డయాబెటిక్ సమ్మేళనాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?