హోలీ రంగుల నుంచి సేఫ్‌గా ఉండాలంటే ఈ సూచనలు పాటించండి.. చర్మం, జుట్టు కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

హోలీ పండుగ ఆనందాల పండుగ. అయితే రంగులతో ఆడే సమయంలో చర్మం, జుట్టు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కెమికల్స్ కలిసిన రంగులు శరీరం బయట, లోపల అలర్జీలకు కారణంగా అవుతుంది. చర్మం, జుట్టు పొడిబారడం, జుట్టు రాలడం వంటి సమస్యలకు దారి తీస్తాయి. కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. హోలీ రంగుల సైడ్‌ ఎఫెక్ట్స్‌ నుండి తప్పించుకోవడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలి...? సరైన నివారణ మార్గాలేంటో ఇక్కడ చూద్దాం..

హోలీ రంగుల నుంచి సేఫ్‌గా ఉండాలంటే ఈ సూచనలు పాటించండి.. చర్మం, జుట్టు కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
Pre Holi Skincare Routine

Updated on: Feb 27, 2026 | 8:58 PM

హోలీ ఆడే ముందు ముఖం, చేతులు, మెడ వంటి బయటపడే భాగాలపై కొబ్బరి నూనె లేదా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇది రంగులు నేరుగా చర్మానికి అంటుకోకుండా రక్షణ ఇస్తుంది. పూర్తి చేతులున్న దుస్తులు ధరించడం మంచిది. సన్‌స్క్రీన్ కూడా వాడితే చర్మం మరింత రక్షితంగా ఉంటుంది. హోలీ రంగులతో ఆడుకోవడానికి ముందు మీ చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఇది చర్మంపై రక్షణ పొర మాదిరిగా పని చేస్తుంది. రంగుల నుంచి స్కిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. బయట ఎక్కువసేపు ఎండలో హోలీ ఆడేవారు సన్‌స్క్రీన్ రాసుకుంటే మంచిది. తద్వారా ఎండ వల్ల స్కిన్ పాడవకుండా ఉంటుంది.

పొడవు చేతులు ఉన్న దుస్తులు ధరించడం వల్ల చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. రంగులు కూడా ఎక్కువగా అంటుకోవు. హోలీ ఆడడానికి వెళ్లేటప్పుడు హెవీ మేకప్ వేసుకోవద్దు. దీనివల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీలైనంత వరకు మేకప్ లేకుండా ఆడుకోండి. పెదవులు ఆరిపోకుండా ఉండడానికి లిప్ బామ్ రాసుకోండి. పైగా పెదాలపై రంగు పడినా సులభంగా తొలగిపోతుంది. రంగులతో ఆడిన తర్వాత కాస్త తేలికపాటి ఫేస్ వాష్‌తో ముఖాన్ని వాష్ చేయండి. గట్టిగా రుద్దడం వల్ల కూడా స్కిన్ పాడవుతుందని గుర్తుపెట్టుకోండి.

ఇకపోతే, జుట్టు సంరక్షణ కోసం జుట్టుకు ముందుగా నూనె రాయాలి. ఇలా చేయడం వల్ల రంగు జుట్టులో లోపలికి చొచ్చుకుపోదు. వీలైతే జుట్టును జడగా లేదా పోనీటైల్‌గా కట్టుకోవాలి. స్కార్ఫ్ లేదా క్యాప్ ఉపయోగించడం మరింత మంచిది. గోళ్లకు కాస్త ముదురు రంగులో ఉండే నెయిల్ పాలిష్ వేస్తే రంగులు గోర్ల లోపలికి వెళ్లిపోకుండా ఉంటాయి. గోర్లు హెల్తీగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

హోలీ తర్వాత ఏం చేయాలి?:

తక్షణమే మైల్డ్ షాంపూ, సాఫ్ట్ సబ్బుతో స్నానం చేయాలి. గట్టిగా రుద్దకూడదు. చర్మానికి ఆలొవెరా జెల్ లేదా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. జుట్టుకు కండీషనర్ ఉపయోగించడం వల్ల పొడిబారడం తగ్గుతుంది. సహజమైన, హానికరం కాని రంగులు వాడితే ఆరోగ్యానికి మంచిది. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే హోలీ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us