
మన చుట్టూ కనిపించే మొక్కలు, చెట్లు మన జీవితంపై, ఇంటి వాస్తుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నాయి. సాధారణంగా రావి చెట్టుకు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. రావి చెట్టులో త్రిమూర్తులు, దేవతలు కొలువై ఉంటారని భక్తుల నమ్మకం. అయితే, ఈ పవిత్రమైన చెట్టు పొరపాటున కూడా ఇంటి లోపల లేదా ఇంటి గోడల మధ్య మొలకెత్తి పెరిగితే అది అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది.
వాస్తు దోషాలు: వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, రావి చెట్టు చాలా పెద్దదిగా, ఎత్తుగా పెరుగుతుంది. దీని వేర్లు చాలా లోతుగా వెళ్లి ఇంటి పునాదులను బలహీనపరుస్తాయి. అంతేకాకుండా, ఇంట్లో రావి చెట్టు ఉండటం వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, నిరంతరం గొడవలు, ప్రతికూల శక్తి పెరుగుతుంది.
అదృష్ట లోపం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటి ప్రాంగణంలో రావి చెట్టు వాటంతట అవే పెరగడం వల్ల కుటుంబ సభ్యుల పురోగతికి ఆటంకాలు ఏర్పడతాయని భావిస్తారు.
మీ ఇంట్లో లేదా గోడల మధ్య రావి చెట్టు పెరిగితే భయపడాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం.. పవిత్రమైన రావి చెట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ కొడవటితో లేదా కత్తెరతో నేరుగా నరకకూడదు. అలా చేస్తే తీవ్రమైన దోషం చుట్టుకుంటుంది. రావి మొక్క కొద్దిగా పెరిగిన వెంటనే, దానిని వేర్లతో సహా జాగ్రత్తగా తవ్వి బయటకు తీయాలి. ఆ మొక్కను ఏదైనా దేవాలయంలో, రావి చెట్లు ఎక్కువగా ఉండే పవిత్ర ప్రదేశంలో లేదా పెద్ద కుండీలో నాటాలి.
మొక్కను తొలగించిన తర్వాత, ఆ ప్రాంతంలో కొద్దిగా గంగాజలం చల్లి, దేవుని నామస్మరణ చేసుకోవడం ద్వారా వాస్తు దోషాల ప్రభావం తొలగిపోతుంది. కాబట్టి, దైవిక భావనలతో కూడిన రావి చెట్టును పూజించడం మంచిదే అయినప్పటికీ, అది ఇంటి వెలుపల లేదా దేవాలయాల్లో మాత్రమే ఉండటం శ్రేయస్కరం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..