
ఒకకప్పుడు కేవలం వయస్సు మళ్లిన వారిలో మాత్రమే కనిపించే పక్షవాతం ప్రస్తుత రోజుల్లో యువకులు కూడా కనిపిస్తోంది. ఇందుకు ఉదాహరణ ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రత్యాక గాంచిన వ్యక్తులు కూడా ఈ వ్యాధిని ఎదుర్కొన్నారు. ఈ పక్షవాతం వచ్చిన తర్వాత చాలా మంది శరీరంలోని ఏదో ఒక భాగంలో బలహీనతను మనం గమనించవచ్చు. మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, నడవడంలో ఇబ్బంది లేదా రోజువారీ పనుల కోసం ఇతరులపై ఆధారపడటం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఏయిమ్స్ వైద్యులు కనిపెట్టిన ఈ చికిత్స వారిలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.
ఎయిమ్స్ అధ్యయనంతో రోగుల్లో కొత్త ఆశ
AIIMS ఢిల్లీ నిర్వహించిన ఒక కొత్త అధ్యయనం స్ట్రోక్ రోగులకు ఆశాకిరణంగా ఉద్భవించింది. ఈ అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ కేవలం 30 నిమిషాలు ఎండలో కూర్చోవడం వల్ల స్ట్రోక్ రోగులలో కోలుకోవడం, నిద్ర, మానసిక స్థితి మెరుగుపడిందని.. అది కూడా ఎలాంటి ఖర్చు లేకుండా జరిగిందని వైద్యులు తెలిపారు. 2023-25 మధ్య నిర్వహించబడిన ఈ అధ్యయనం తాజాగా సంస్థ ఐదో పరిశోదన దినోత్సవం సందర్భంగా ప్రదర్శించబడింది. ఈ అధ్యయనం తర్వాత సాధారణ చికిత్స, ఫిజియోథెరపీతో పాటు సూర్యరశ్మి చికిత్స పొందిన స్ట్రోక్ రోగులు ప్రామాణిక చికిత్స మాత్రమే పొందిన వారి కంటే చాలా మెరుగైన జీవన నాణ్యతను పరిశోదకులు కనుగొన్నారు.
అధ్యయనం ఎలా జరిగింది?
ఈ అధ్యయనం కోసం మీడియం-లెవల్ స్ట్రోక్‌తో బాధపడుతున్న 18 నుండి 80 సంవత్సరాల వయస్సు గల 200 మంది రోగులు పరీక్షించిన తర్వాత 40 మంది రోగులను ఎంపిక చేసి, ఆపై రెండు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపు వారికి ప్రామాణిక వైద్య చికిత్స, పునరావాసం మాత్రమే లభించింది, అలాగే రెండవ గ్రూపు వారికి రెండు వారాల పాటు ప్రతిరోజూ 30 నిమిషాలు ప్రామాణిక చికిత్స, 30 నిమిషాల పాటు సూర్యరశ్మిలో కూర్బొబెట్టడం ద్వారా చికిత్స అందించారు. 10,000 నుంచి 25,000 లక్స్ సూర్యకాంతి తీవ్రతలో వారికి చికిత్స ఇచ్చారు. ఇది తేలికపాటి బహిరంగ పగటి వెలుతురుతో సమానం. భద్రత కోసం, దీనిని లక్స్ మీటర్‌తో నిరంతరం పర్యవేక్షించారు. రోగుల శారీరక సామర్థ్యాలు, మానసిక స్థితి, నిద్ర, రోజువారీ కార్యకలాపాలు, మొత్తం శ్రేయస్సును మూడు నెలలుగా పరిశీలించారు.
అధ్యయనం ఫలితం ఏమిటి?
వైద్యుల అభిప్రాయం ప్రకారం, సూర్యకాంతి చికిత్స పొందుతున్న రోగులు మెరుగైన నిద్ర నాణ్యతను పొందారు. నిద్ర అనేది మానసిక స్థితితో ముడిపడి ఉంటుంది. ఇది వారి రోజువారీ కార్యకలాపాలలో స్వావలంబన పెంచింది. సూర్యరశ్మి శరీర జీవ గడియారాన్ని నియంత్రించి.. విటమిన్ డి పెంచడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో వాపును తగ్గించవచ్చని నిపుణులు విశ్వసిస్తున్నారు, ఇవన్నీ స్ట్రోక్ రికవరీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు.
ఇది భారతీయులకు ఎందుకు ప్రత్యేకమైనది?
భారతదేశంలో, స్ట్రోక్ నుండి కోలుకోవడం అనేది సుదీర్ఘమైన, ఖరీదైన ప్రక్రియగా పరిగణించబడుతుంది. కాబట్టి మధ్య తరగతి, నిరుపేద ప్రజలు ఈ చికిత్సను తీసుకోలేరు. ఈ సమస్యను అదిగమించాలంటే చాలా కాలంపాటు ఫిజియోథెరపీ చేసుంచుకోవాల్సి ఉంటుంది. కానీ ఇది అందరికీ అందుబాటులో ఉండదు. అందువల్ల, 30 నిమిషాల సూర్యకాంతి వంటి ఉచిత, సురక్షితమైన, సులభంగా లభించే చికిత్స వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు ఇది ఎంతో ఊరటనిస్తుంది.ఈ అధ్యయనం నమూనా పరిమాణం చిన్నది అయినా ఇది ఒకే కేంద్రంలో నిర్వహించబడినప్పటికీ, పెద్ద స్థాయిలో మరింత పరిశోధన జరిగితే, సూర్యరశ్మి చికిత్స పోస్ట్-స్ట్రోక్ కేర్‌లో ముఖ్యమైన భాగంగా మారుతుందని వైద్యులు అంటున్నారు.
స్ట్రోక్ గురించి ICMR డేటా ఏమి చెబుతుంది?
గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ డేటా ప్రకారం, 2021 లో భారతదేశంలో దాదాపు 1.2 మిలియన్ల కొత్త స్ట్రోక్ కేసులు నమోదయ్యాయి. ఇంకా, దాదాపు 9.4 మిలియన్ల మంది బలహీనత, ప్రసంగ లోపం లేదా జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి స్ట్రోక్ దీర్ఘకాలిక ప్రభావాలతో బాధపడ్డారు. 2021 సంవత్సరానికి ICMR డేటా ప్రకారం స్ట్రోక్ భారతదేశంలో మరణానికి మూడవ ప్రధాన కారణంగా మారింది. ఇది వైకల్యానికి ఆరవ ప్రధాన కారణం, అంటే స్ట్రోక్ తర్వాత చాలా మంది సాధారణ జీవితాన్ని గడపలేకపోతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సహకారంతో 2023లో లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, పరిస్థితి మారకపోతే, 2050 నాటికి తక్కువ, మధ్య-ఆదాయ దేశాలలో స్ట్రోక్ వల్ల సుమారు 10 మిలియన్ల మంది మరణించవచ్చు.
Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్ , నివేదికల ఆధారంగా అందించబడినవి మాత్రమే.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిని పాటించే ముందు వైద్యులను సంప్రదించండి
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.