
బిజీ షెడ్యూల్ కారణంగా జిమ్‌కు వెళ్లలేని వారికి కేవలం 15 నిమిషాల రోజువారీ వర్కవుట్ ప్లాన్ అద్భుతంగా సహాయపడుతుంది. తక్కువ సమయంలో శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని సులభమైన వ్యాయామాలు దోహదపడతాయి. రోజూ క్రమం తప్పకుండా కొన్ని సింపుల్ వర్కవుట్స్ చేయడం ద్వారా శరీరంలోని కండరాలు బలపడతాయి. ఇది మెటబాలిజంను వేగవంతం చేసి, రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ఎలాంటి పరికరాలు అవసరం లేకుండా ఇంట్లోనే సులభంగా చేసుకోగల ఈ వ్యాయామాలు ఆరోగ్యకరమైన జీవనశైలికి పునాది వేస్తాయి.
ఏదైనా వ్యాయామం ప్రారంభించే ముందు శరీరాన్ని సిద్ధం చేయడం చాలా ముఖ్యం. దీనికోసం రెండు నిమిషాల పాటు స్పాట్ జాగింగ్, ఆర్మ్ సర్కిల్స్ లేదా తేలికపాటి స్ట్రెచింగ్ చేయాలి. ఇది కండరాలకు రక్త ప్రసరణను పెంచి గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
శరీర కింద భాగం కాళ్లు, పిరుదులు) బలంగా మారడానికి బాడీ వెయిట్ స్క్వాట్స్ అత్యంత ప్రభావవంతమైనవి. వీపును నేరుగా ఉంచి కుర్చీలో కూర్చున్నట్లు కిందకు వంగి పైకి లేవాలి. ఇది కాళ్ల కండరాలను దృఢపరుస్తుంది.
ఛాతి, చేతులు, భుజాల బలాన్ని పెంచడానికి పుష్-అప్స్ చేయాలి. ఒకవేళ ఇవి చేయడం కష్టంగా ఉంటే మోకాళ్లపై లేదా గోడను ఆనుకుని వాల్ పుష్-అప్స్ చేయవచ్చు. ఇది శరీర పైభాగానికి మంచి వ్యాయామం.
పొట్ట భాగంలోని కండరాలు గట్టిపడటానికి ప్లాంక్ అద్భుతంగా పనిచేస్తుంది. మోచేతులు నేలపై ఆనించి, శరీరాన్ని ఒకే సరళ రేఖలో ఉంచుతూ 30 నుండి 45 సెకన్ల పాటు ఆ స్థానంలో ఉండాలి. ఇది పొట్ట చుట్టూ కొవ్వు కరగడానికి సహాయపడుతుంది.
చివరిగా జంపింగ్ జాಕ್ಸ್ లేదా హై నీస్ చేయడం ద్వారా గుండె వేగం పెరుగుతుంది. ఆ తర్వాత చివరి రెండు నిమిషాలు శ్వాసను క్రమబద్ధం చేసుకుంటూ తేలికపాటి స్ట్రెచింగ్ చేయడంతో వర్కవుట్ ముగిస్తుంది.
సమయం లేదనే సాకు చెప్పకుండా రోజూ కేవలం 15 నిమిషాలు ఈ క్రమశిక్షణతో కూడిన వర్కవుట్ చేస్తే మంచి ఫిట్‌నెస్, శక్తి, సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.