
ప్రస్తుతం చాలామంది పట్టణాలలో, ముఖ్యంగా అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్నారు. సూర్యరశ్మి సరిగా పడక, ఇంట్లో మొక్కలు పెంచడం కష్టమని, పచ్చదనం ఇళ్లకు, కళ్లకు దూరమైందని భావిస్తుంటారు. అయితే, పచ్చదనాన్ని, స్వచ్ఛమైన గాలిని అందించడానికి, తక్కువ సూర్యకాంతితో కూడా ఆరోగ్యంగా పెరిగే అద్భుతమైన మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలు కేవలం అందాన్ని మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఈ మొక్కలకు ఎక్కువ నిర్వహణ కూడా అవసరం లేదు. తక్కువ కాంతిలోనూ పెరిగే మొక్కలేంటో తెలుసుకుందాం…
ఇది గాలిని శుద్ధి చేయడంలో ముందుంటుంది. రాత్రి వేళల్లో కూడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. దీనికి ఎక్కువ కాంతి అవసరం లేదు, అప్పుడప్పుడు నీరు పోస్తే చాలు. మీ పడక గదికి ఇది చాలా అనుకూలం.
దీనిని తరచుగా మార్చాల్సిన అవసరం లేదు. దీని ఆకులు ఆకర్షణీయంగా ఉండి, తక్కువ కాంతిలో కూడా వేలాడుతూ పెరుగుతాయి. తక్కువ నీటితోనే జీవించగల ఈ మొక్కను ఇంటిలోని ఏ మూలకైనా అలంకారంగా ఉపయోగించవచ్చు.
ఈ మొక్క చాలా తక్కువ కాంతిని, తక్కువ నీటిని తట్టుకోగలదు. ఇది చాలా త్వరగా చనిపోదు కాబట్టి, కొత్తగా మొక్కలు పెంచేవారికి లేదా ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి ఇది అనుకూలం. దీని నిగనిగలాడే ఆకులు ఇంటికి ఒక లగ్జరీ లుక్‌నిస్తాయి.
ఇది పచ్చని ఆకులతో, తెలుపు పువ్వులతో అందంగా ఉంటుంది. అలంకరణకు అత్యుత్తమ ఎంపిక. ముఖ్యంగా ఇది గాలిలోని బెంజీన్ మరియు ఫార్మాల్డిహైడ్ వంటి కొన్ని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. దీనికి కాంతి అవసరం లేదు, కానీ పువ్వులు రావాలంటే కొంచెం వెలుతురు అవసరం.
దీని హృదయాకారపు ఆకులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇది తక్కువ కాంతిలో పెరిగి, ఇంటికి ప్రత్యేక అలంకారంగా ఉంటుంది. ఇది చాలా త్వరగా పెరుగుతుంది, నిర్వహణ చాలా సులభం.
ఈ మొక్క గాలిని శుద్ధి చేయడంలో బాగా పనిచేస్తుంది. ఇది పిలకలను ఉత్పత్తి చేసే తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీనిని కిటికీ దగ్గర లేదా వేలాడదీసిన కుండీలలో పెంచితే చాలా అందంగా కనిపిస్తుంది.
పెద్ద, ఆకుపచ్చని, తెలుపు రంగుల ఆకులతో ఇంటికి పచ్చని కళను ఇస్తుంది. దీనికి కూడా ప్రత్యక్ష సూర్యకాంతి అవసరం లేదు.
ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంటికి పచ్చదనం రావడమే కాక, గాలి కూడా శుద్ధి అవుతుంది. తక్కువ కాంతిలో జీవించగల ఈ మొక్కలు, మీ అపార్ట్‌మెంట్లలో, కార్యాలయాలలో పచ్చని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి సరైన పరిష్కారం. ప్రతిరోజూ వాటిని చూస్తూ గడపడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.