
ఆదివారం వచ్చిందంటే.. చాలు నాన్ వెజ్ ప్రియుల ఇళ్లల్లో మటన్, చికెన్ ఉడకాల్సిందే.. చాలా మంది మటన్, చికెన్ ను ఇష్టంగా కొని తెచ్చుకుని.. కర్రీ, ఫై రూపంలో వండుకుని తింటారు. అయితే.. కర్రీ, ఫ్రై కంటే డిఫెరెంట్ గా మేక తలకాయ కూర అద్భుతంగా ఉంటుంది.. వాస్తవానికి మేక మాంసంతోపాటు.. తలకాయ, కాళ్లు, లివర్, బోటి ఇలా అన్ని కూడా పోషకాలతో నిండి ఉంటాయి.. అయితే.. మేక తలకాయ మంచి పోషకాహారం అని డైటీషియన్లు చెబుతున్నారు. మటన్ హెడ్ లో ప్రోటీన్, విటమిన్ బి12, ఐరన్, ఫాస్పరస్, అలాగే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంతోపాటు.. మెదడు పనితీరును మెరుగురుస్తాయి.. ఇంకా రక్తహీనతను నివారించి.. గుండె ఆరోగ్యానికి సహాయపడుతుందని డైటీషియన్లు చెబుతున్నారు. అంతేకాకుండా.. ఎముకల ఆరోగ్యానికి తలకాయ కూర అద్భుతంగా సహాయపడుతుంది. దీనిలోని కాపర్, ప్రొటీన్లు శరీరాన్ని చురుగ్గా ఉంచడంతోపాటు శక్తిని అందిస్తాయి..
మేక తలకాయ ముక్కలు, ఉల్లిపాయలు – 3 (సన్నగా తరిగినవి), పచ్చిమిర్చి – 4 లేదా 5, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు, కొత్తిమీర – తగినంత, ఒక టమాట..
ప్రెషర్ కుక్కర్‌ను ఉపయోగించి సులభమైన, రుచికరమైన తలకాయ కూర వంటకాన్ని తయారు చేస్తే.. తొందరగా ఉడుకుతుంది..
ముందుగా తలకాయ ముక్కలను శుభ్రపరుచుకోవాలి..
మొదట, కొద్దిగా నూనె వేసి, అందులో యాలక్కాయలు, చెక్క, లవంగాలు, మిరియాలు వేసి వేయించాలి.. బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు.. వీటిని పొడి చేసుకోవచ్చు.. లేదా నేరుగా వంటకు ఉపయోగించుకోవచ్చు.. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఎర్రగా వేయించాలి.. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించారు.
టొమాటో ముక్కలు వేసి కొద్దిగా మగ్గిన తర్వాత, శుభ్రం చేసుకున్న మేక తలకాయ మాంసాన్ని చేర్చాలి.. ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి, మూత పెట్టి కొద్దిసేపు మగ్గించాలి.. ఈ దశలో మాంసం నుండి నీరు ఊరడం ప్రారంభమవుతుంది..
ఆ తర్వాత వంటకానికి ప్రత్యేక రుచిని అందించే మసాలాలను చేర్చాలి.. ఎండు కొబ్బరి, గసగసాల పేస్ట్.. అలాగే.. ధనియాలు, చెక్క, లవంగాలు వేయించి పొడి చేసుకున్న మసాలా పొడిని కలపాలి.. ఈ పేస్ట్ చేర్చగానే కూర చిక్కబడుతుంది.. తగినంత కొత్తిమీర, అవసరమైనంత నీళ్లు పోసి, ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
కుక్కర్ నుండి ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత, మూత తీసి, కూరను అవసరమైన చిక్కదనానికి మగ్గించుకోవాలి.. ఉప్పు సరిచూసుకొని, మరికొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే రుచికరమైన మేక తలకాయ కూర సిద్ధమవుతుంది.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తలకాయ కర్రీని అద్భుతంగా వండుకుని ఆస్వాదిస్తూ తినండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..