Motion Sickness: ప్రయాణాల్లో తరుచు వాంతులు అవుతున్నాయా..? ఈ సింపుల్‌ చిట్కాలను ట్రై చేయండి..

ప్రయాణ సమయాల్లో వాంతులు చేసుకోవడం అనేది సాధార‌ణంగా చాలా మంది ఎదుర్కొనే స‌మ‌స్యే. కొంద‌రికి కారు అంటే పడ‌దు. మ‌రికొంద‌రు బ‌స్సు అంటే పడదు, మరికొందదికి విమానం అంటే పడదు. ఇలాంటి వాహనాల్లో ప్రయాణించినప్పుడు వాళ్లు వాంతులు చేసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్‌ పెట్టవచ్చు. కాబట్టి ఆవేంటో ఇప్పుడు తెలసుకుందాం.

Motion Sickness: ప్రయాణాల్లో తరుచు వాంతులు అవుతున్నాయా..? ఈ సింపుల్‌ చిట్కాలను ట్రై చేయండి..
Vomiting While Travelling

Updated on: Oct 09, 2025 | 7:30 AM

ప్రయాణ సమయాల్లో వాంతులు చేసుకోవడం అనేది సాధార‌ణంగా చాలా మంది ఎదుర్కొనే స‌మ‌స్యే. కొంద‌రికి కారు అంటే పడ‌దు. మ‌రికొంద‌రు బ‌స్సు అంటే పడదు, మరికొందదికి విమానం అంటే పడదు. ఇలాంటి వాహనాల్లో ప్రయాణించినప్పుడు వాళ్లు వాంతులు చేసుకుంటూ ఉంటారు.ఈ సమస్యకు చెక్‌ పెట్టాలంటే ఇలా చేయడం.. ఒక వేల మీరు కారులో ప్రయాణిస్తుంటే.. వీలైనంత వ‌ర‌కు ముందు సీట్ల‌లో కూర్చోవడానికి ప్రయ‌త్నించండి. లేదా వెనక సీట్‌లో కూర్చుంటే కిటికీ పక్కన కూర్చొండి, బస్సులో అయినా ఇలానే చేయండి. ఎందుకంటే కిటికీ పక్కనుంచి కనిపించే ప్రకృతి, దృశ్యాలపై ద్యాస పెట్టండి. అలాగే చల్లగాలిని పీల్చండి. వీలైనంత వరకు విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం ద్వారా మీకు వాంతింగ్ సెన్‌సేషన్ రాకుండా ఉంటుంది.

ప్రయాణంలో ఈ ఆహారాలు తీసుకోండి

మీకు ప్రయాణం వాంతింగ్ వచ్చే అలవాటు ఉంటే మీరు ఒక అల్లం ముక్కను మీ దగ్గర ఉంచుకోండి. ప్రయాణంలో దాన్ని నములుతూ ఆ రసాన్ని మింగండి.ఇది వికారాన్ని తగ్గిస్తుంది. ప్రయాణ సమయంలో అల్లం టీ తీసుకోవడం కూడా మంచి ఎంపిక. వీటితో పాటు నిమ్మకాయ‌ను కూడా మీ దగ్గర పెట్టుకోండి. దాన్ని త‌ర‌చూ వాస‌న పీలుస్తూ ఉండండి. అలాగే ప్రయాణాంలో వాంతికి అవ‌కుండా ఉండాలంటే తక్కువ భోజనం తీసుకోండి.

ప్రయాణ సమయంలో వీటికి దూరంగా ఉండండి

ప్రయాణం చేసే ముందు మీరు అస్సలు ఎక్కువ ఫుడ్‌ తినకండి. అలాగే త్వరగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోండి. నూనె ప‌దార్థాలు, మ‌సాలా, కారంగా ఉండే ఆహారాలు పదార్థాలను తీసుకోండి. ఇలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా వికారం, వాంతింగ్ సెన్‌సేషన్ కలిగిస్తాయి. కాబట్టి మీరు ప్రయాణాల్లో ఉన్నప్పుడు వీటికి దూరంగా ఉండండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.