స్ట్రాబెరీస్ విదేశాల నుంచి మన దేశంలోకి అడుగు పెట్టి ఇక్కడ కూడా ఆదరణ సొంతం చేసుకున్నాయి. తియ్యగా పుల్లగా ఎరుపు రంగులో ఆకర్షణీయంగా ఉండే స్ట్రాబెర్రీలు పిందెలుగా ఉన్న సమయంలో తెల్లగా ఉంటాయి. అవి పక్వానికి వచ్చే కొద్దీ ఎరుపురంగులోకి మారతాయి. అయితే ఇప్పటి వరకూ మన దేశంలో ఎర్రటి స్ట్రాబెరీస్లను చూసినా విదేశాల్లో మాత్రం ఎప్పటి నుంచో తెల్ల స్ట్రాబెర్రీలు మార్కెట్లో సందడి చేయడం మొదలు పెట్టాయి. 2010ల ప్రారంభంలో ప్రజాదరణ వైట్ స్ట్రాబెర్రీలు కొన్ని తెల్లగా మరికొన్ని లేత గులాబీ రంగులో ఉంటాయి. వీటి టేస్ట్ కూడా చాలా తియ్యగా ఉంది.. జ్యుసిగా ఉంటాయి. అయితే ఈ వైట్ స్టాబెర్రీలు మన దేశంలో అడుగు పెట్టాయి. అది కూడా మన రైతులే పండించడం విశేషం.
మహారాష్ట్రలోని ఓ రైతు ప్రత్యేకమైన తెల్లని స్ట్రాబెర్రీని పండిస్తున్నారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మహాబలేశ్వర్, భిలార్, వై ప్రాంతాల్లో స్ట్రాబెర్రీలను పండిస్తారు. ఇప్పుడు సతారాలోని వాయిలోని ఫూలే నగర్లో నివసిస్తున్న ఒక రైతు తెల్ల స్ట్రాబెర్రీలను పండించాడు.
సతారాలోని ఫూలేనగర్‌కు చెందిన ఉమేష్ ఖమ్కర్ అనే రైతు అర ఎకరంలో తెల్లటి స్ట్రాబెర్రీతో ప్రయోగాలు చేశాడు. మార్కెట్లో ఈ స్ట్రాబెర్రీలను విక్రయించడం కూడా ప్రారంభించాడు. త్వరలో ఈ ప్రత్యేకమైన వైట్ స్ట్రాబెర్రీ ఆన్లైన్లో కూడా విక్రయించడానికి రెడీ అవుతున్నాడు.
ఈ స్ట్రాబెర్రీ ప్రత్యేకత ఏమిటంటే దీని ధర కిలో 1000 నుండి 1500 రూపాయల వరకు ఉంటుంది. ఈ స్ట్రాబెర్రీ దిగుబడి ఆరు రెట్లు ఎక్కువ కావడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. వీటి టేస్ట్ కూడా చాలా తియ్యగా ఉంది.. జ్యుసిగా ఉంటాయి. కొన్ని అనాస పండు ఫ్లేవర్ ని కూడా కలిగి ఉంటాయి.
ఈ తెల్లని స్ట్రాబెర్రీని మొదట అమెరికా, ఇంగ్లండ్‌లో ప్రయోగించారు. ఈ స్ట్రాబెర్రీ పేరు ఫ్లోరిడా పెర్ల్. ఈ రకమైన స్ట్రాబెర్రీ భారతదేశంలో మొదటిసారిగా సాగు చేస్తున్నాయి. ఈ తెల్లటి స్ట్రాబెర్రీ మహారాష్ట్రలో మొదటిసారిగా సాగు చేస్తున్నారు. త్వరలో ఈ వైట్ స్ట్రాబెర్రీ సాగును ఇతర ప్రాంతాల్లో కూడా మొదలు పెట్టనున్నారు. భారతదేశంలో తెల్లటి స్ట్రాబెర్రీలను సాగు చేసిన రైతుగా సతారా వాయికి చెందిన రైతు ఉమేష్ ఖమ్కర్ ఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. ఇందుకోసం యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా నుంచి రాయల్టీ హక్కులను కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఎవరైనా భారతదేశంలో సాగు చేయాలనుకుంటే.. ఆ రైతులు తప్పని సరిగా ఉమేష్ ఖమ్కర్ నుండి వైట్ స్టాబ్రేర్రీ సాగు చేసేందుకు హక్కులను కొనుగోలు చేయాల్సి ఉంది.
వైట్ స్ట్రాబెర్రీలు ఎరుపు స్ట్రాబెర్రీల కంటే కొంచెం తియ్యగా ఉంటాయి.
స్ట్రాబెర్రీలలో ఉండే పోషకాల వల్ల శరీరానికి మేలు చేస్తుంది.
స్ట్రాబెర్రీలు తక్కువ సహజ ఆమ్లత్వం కారణంగా ప్రసిద్ధి చెందాయి. వి
దేశాల్లో కూడా వైట్స్ స్ట్రాబెర్రీలు బాగా ప్రాచుర్యం పొందాయి.
ఈ స్ట్రాబెర్రీలకు భారతదేశంలో కూడా మంచి మార్కెట్ ఉంది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..